కమిట్మెంట్ ఇచ్చినా అవకాశాలు రావు, తెలుగు అమ్మాయి హిమజ షాకింగ్ కామెంట్స్.
అవకాశాలు ఇప్పిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. తాజాగా నటి హిమజ క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కవు అని మొదటి నుంచి ఉన్న వాదన.. దీని పై చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. తాజాగా హిమజ కూడా దీని పై మాట్లాడింది.. కమిట్మెంట్ అనే పదం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. హిమజ మాట్లాడుతూ.. .
కమిట్మెంట్ లో ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అదే పరిస్థితి అంటుంది హిమజ. అయితే హిమజ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి సంబంధించి వచ్చే వ్యాఖ్యలు, వినిపించే ప్రచారాల గురించి సూటిగా స్పందించింది. యాంకర్ హిమజను.. తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ గా ఉంటారు. అందుకే అవకాశాలు రావడం లేదా అని ప్రశ్నించగా.. “తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ గా ఉండరు అనే విషయం ఇప్పటికే రుజువు అయ్యింది.
అలాగే సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇచ్చిన అందరికీ అవకాశాలు రాలేదు. అవకాశాలు వచ్చిన అందరూ కమిట్మెంట్ ఇవ్వలేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి అవకాశాలు వస్తున్నాయి అంటే లోపం ఎక్కడుంతే చెప్పలేం కదా. ఎవరు వెళ్లారు? ఏంటో మనం ఎంక్వైర్ చేయలేం కదా. ఇంకొకటి అత్యాస వల్ల కూడా అవకాశాలు పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు. అంటే వచ్చిన పాత్రతో కాకుండా..
హీరోయినే కావాలి అని వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. నేను సీరియల్స్ చేసే టైమ్ లో కొంచెం ఇష్టం కొంచం కష్టం సీరియల్ కి వరుసగా రెండేళ్లు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్నాను. ఆ సమయంలో నాకు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఒక పని మనిషి పాత్ర నాకు వచ్చింది. నేను చేస్తాను అని చెప్పాను. ఎందుకంటే తెలుగులో హిమజా అనే ఒక అమ్మాయి ఉంది అని తెలిసేలా చేయాలి అనుకున్నాను.