ఇండస్ట్రీలో మరో విషాదం. అనుమానాస్పద స్థితిలో స్టార్ నిర్మాత మృతి.
చిత్ర నిర్మాత దర్శకుడు అయిన తరుణ్ సుధీర్, Xలో దివంగత చిత్ర నిర్మాతకు తన అంతిమ నివాళులు అర్పిస్తూ, ”సౌందర్య జగదీష్ సార్ ఆకస్మిక మరణం గురించి విని షాక్ బాధ కలిగింది. కన్నడ చిత్ర పరిశ్రమలో అతని ఉనికి చాలా మిస్ అవుతుంది. అతని కుటుంబానికి ప్రియమైనవారికి హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. అయితే కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త సౌందర్య జగదీశ్ అనుమానాస్పద స్థితిలో ఆయన ఇంట్లో శవంగా కనిపించారు. మహాలక్ష్మి లే అవుట్ లో నివాసం ఉండే జగదీశ్ (55) బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు. జగదీశ్ ఆపస్మారక స్థితిలో కనిపించగా కుటుంబ సభ్యులు వెంటనే రాజీవ్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు.
అసహజ మరణంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య కోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. అంత్యక్రియల నిమిత్తం ఆయన మృతదేహాన్ని స్వగృహంలో ఉంచారు. జగదీష్ మరణాంతరం ఆయన సతీమణి ఫిర్యాదు చేసినట్లు డీసీపీ సైదులు అదావత్ తెలిపారు. ‘మేము కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఇటీవల జగదీశ్ అత్తమ్మ చనిపోయింది. ఆమెతో ఎంతో అనుబంధం ఉన్న జగదీశ్ ఆ విషయం జీర్ణించుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఒత్తిడి తగ్గేందుకు మెడిసన్స్ తీసుకుంటున్నట్లు సమాచారం.అదే డిప్రేషన్ తో ఆత్మహత్యకు పాల్పపడి ఉండొచ్చని భావిస్తున్నాం’ అని అన్నారు. కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలు లేవని జగదీశ్ బంధువులు విలేకరులకు చెప్పారు. అప్పు అండ్ పప్పు, మస్త మజా మాది, స్నేహితరు, రామలీల వంటి హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు జగదీశ్. ఆయన మృతిపై సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.