News

Malaika Arora: 50 ఏళ్ల వయసులో ఒళ్లును విల్లులా వంచేస్తోన్న సీనియర్ హీరోయిన్.

బాలీవుడ్ నటి మలైకా అరోరా తన ఫిట్‌నెస్ విషయంలో ఎంతో సీరియస్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు జిమ్‌కు వెళ్లి వర్కౌట్లు చేసి బయటకొచ్చేటప్పుడు ఫొటోలకు క్లిక్ మనిపించేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే స్టార్ హీరోయిన్స్ సైతం మలైకా అందం, ఫిట్ నెస్ ముందు దిగదూడుపే అన్నట్లుగా కనిపిస్తుంది. మలైకా జిమ్ వర్కవుట్స్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతుంటాయి. అలాగే నిత్యం ఏదోక విషయం గురించి సోషల్ మీడియాలో మలైకా పేరు వినిపిస్తుంది.

ఫిట్నెస్, హెల్త్ విషయంలో మలైకా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందన్న సంగతి తెలిసిందే. జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూనే ఎప్పుడూ ఇంట్లో చేసిన ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతుందట. ఇటీవల మలైకా రెండో పెళ్లి, ప్రేమ గురించి పలు విషయాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే వాటిపై ఈ బ్యూటీ స్పందించలేదు. తాజాగా మలైకాకు సంబంధించిన ఓ వీడియో చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మలైకా అరోరా ఫిట్‌నెస్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తుందనే విషయం అందరికీ తెలిసిందే.

మలైకా రెగ్యులర్ గా జిమ్ చేస్తుంది. అంతే కాకుండా యోగా కూడా చేస్తుంది. వీటన్నింటితో పాటు స్ట్రిక్ట్ డైట్ కూడా పాటిస్తుంది. ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునే మలైకాకు సంబంధించిన యోగా వీడియో నెట్టింట వైరలవుతుంది. ఏప్రిల్ 8న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆమె ఈ వీడియోను షేర్ చేసింది. అందులో తన ఒళ్లును విల్లులా వంచేస్తుంది. 50 ఏళ్ల వయసులోనూ కఠినమైన ఆసనాలను ప్రయత్నిస్తూ అందరికి షాకిస్తుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో మలైకా డ్యాన్సర్‌గా, నిర్మాతగా, నటిగా, టెలివిజన్ రియాల్టీ షోల హోస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. కానీ కనిత్యం జిమ్‌కి వెళ్లి వర్కవుట్ చేస్తున్న వీడియోస్, యోగా వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకుంది. 2016లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker