News

Nithya Menen: నిత్యామీనన్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

నిత్యామీనన్‌..టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌, బాలీవుడ్‌ సహా అన్ని భాషల్లోనూ సత్తా చాటుతున్నది. వెండితెరపైనే కాదు.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ అదరగొడుతున్నది. ఇటీవలే ‘కుమారి శ్రీమతి’, ‘మాస్టర్‌ పీస్‌’ వెబ్‌సిరీస్‌లతో అలరించింది. తన సినీ ప్రయాణం, పెళ్లి గురించి.. నిత్య ఇలా ముచ్చటించింది. అయితే ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన నిత్యామీనన్.. ఇప్పుడు స్పీడ్ తగ్గించింది.

అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. అయితే ఈ 36 ఏళ్ల ముద్దుగుమ్మ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఎక్కడా కూడా నిత్యామీనన్ పెళ్లి ఊసే ఎత్తలేదు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై అభిమానులు చాలా ఆసక్తిగా ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పెళ్లి గురించి రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. కొంతమంది సెలబ్రిటీలు కొన్ని ఇంటర్వ్యూలలో పెళ్లి వార్తల గురించి మాట్లాడారు.

నిత్యా మీనన్ పెళ్లి చేసుకోకపోవడానికి పెద్ద కారణం ఉందట. ఈ విషయాన్ని ఆమె గతంలో తెలిపింది. ‘అన్నిటికీ మించి ఎదిగాను. ఏమి చేయాలో, ఏమి చేయకూడదో మరొకరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకున్నారు. వారు నాకు స్వేచ్ఛ ఇచ్చారు. నేను స్వేచ్ఛ లేకుండా జీవించలేను. అది వాళ్లకు కూడా తెలుసు’ అని నిత్యా మీనన్ తెలిపింది. అలాగే పెళ్లి చేసుకోవాలని నిత్యా వాళ్ల అమ్మమ్మ ఒత్తిడి చేసేది.

అయితే ఆమె మరణానంతరం ఎవరూ పట్టించుకోలేదు. అమ్మమ్మ బతికి ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి వచ్చేది. నేను పాపులర్ నటిని కావాలని మా అమ్మమ్మ కోరుకోలేదు. నేను ఏమీ చేయడం లేదని ఆమె భావించింది అందుకే పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చేది. ఆమె ఇప్పుడు మనతో లేరు.ఆమె తప్ప మరెవరూ నా పెళ్లి విషయంలో పెద్దగా బాధపడలేదు’ అని గతంలో చెప్పుకొచ్చింది నిత్యా.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker