News

ఉదయ్ కిరణ్‌ చనిపోవడానికి కారణం ఆ డాక్టరే, మొత్తం బయట పెట్టిన మురళి మోహన్.

ఉదయ్ కిరణ్.. స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్‌లో ఎంతో భవిష్యత్తు ఉంటుందని భావించిన ఉదయ్‌ కిరణ్‌.. ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పటికి కూడా అభిమానులు అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఉదయ్ కిరణ్ జీవితంలో అసలేం జరిగింది అని యాంకర్ ప్రశ్నించగా.. మురళి మోహన్ మాట్లాడుతూ.. ఆ అబ్బాయికి హైపర్ టెన్షన్ ఎక్కువ. నన్ను తరచుగా కలుస్తూ ఉండేవాడు. విపరీతమైన బీపీ తరహాలో టెన్షన్ వచ్చేస్తుంది. ఆ సమయంలో మనిషి కంట్రోల్ లో ఉండడం కూడా కష్టం. ఆ టైంలో మేమంతా మాట్లాడి ఒక డాక్టర్ దగ్గర జాయిన్ చేశాం.

ఆ డాక్టర్ ఉదయ్ కిరణ్ ని సొంత తమ్ముడిగా భావించి ట్రీట్మెంట్ మొదలు పెట్టింది. అన్ని జాగ్రత్తలు చెప్పేది. ఆవేశం తగ్గించుకోవాలి అని చెప్పేది. ఉదయ్ కిరణ్ కూడా అలాగే మేడం అని చెప్పేవాడు. కానీ ఏదైనా సంఘటన జరిగితే మాత్రం ఆవేశపడిపోయేవాడు. ఉదయ్ కిరణ్ తన ప్రాబ్లెమ్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అంతకు ముందు ఉదయ్ కిరణ్ తరచుగా చిరంజీవిని కలిసేవాడు. చిరంజీవికి ఒక అలవాటు ఉంది. ఇండస్ట్రీలోకి ఎవరు కొత్తగా వచ్చినా, మంచి ప్రదర్శన ఇచ్చినా ఫోన్ చేసి అభినందించేవారు.. హీరో, డైరెక్టర్, కెమెరా మెన్ ఇలా అందరిని అభినందించేవారు.

ఉదయ్ కిరణ్ కి కూడా ఒక రోజు ఫోన్ చేసి అభినందించాడు. సార్ మిమ్మల్ని ఒకసారి కలవాలి అని ఉదయ్ కిరణ్ అడగడం.. ఆ తర్వాత వెళ్లి కలవడం జరిగింది. పరిచయం ఏర్పడ్డాక తరచుగా చిరుని వెళ్లి కలిసేవాడు. కొత్త కారు కొనుక్కున్నా, ఇంకేదైనా సంఘటన జరిగినా వెళ్లి చిరంజీవితో షేర్ చేసుకునేవాడు. దీనితో చిరంజీవి ఉదయ్ కిరణ్ పై మంచి అభిప్రాయం ఏర్పడింది. కుర్రాడు చాలా బుద్ధిమంతుడిగా ఉన్నాడు. ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. మన ఫ్యామిలిలో కలుపుకుంటే బావుంటుంది అని ఆశపడినట్లు ఉన్నారు.

చిరంజీవి తర్వాత ఆ ఫ్యామిలీలో అన్నీ చూసుకునేది అల్లు అరవింద్. దీనితో చిరంజీవి.. అల్లు అరవింద్ తో ఉదయ్ కిరణ్ గురించి చర్చించడం.. ఫైనల్ చేసుకుని అనౌన్స్ కూడా చేశారు. మేమంతా చాలా సంతోషించాం. ఉదయ్ కిరణ్ లాంటి మంచి కుర్రాడు.. చిరంజీవి గారి ఫ్యామిలిలో భాగం అవుతున్నాడని ఆనందపడ్డాం. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ మా ఇంటికి కూడా వచ్చాడు. ఇది నీకు చాలా మంచి మ్యాచ్.. జాగ్రత్తగా చూసుకో అని సలహా కూడా ఇచ్చా.

అంతా హ్యాపీగానే ఉంది. కానీ ఏమైందో ఏమో ఆ సంబంధం అప్సెట్ అయింది. ఉదయ్ కిరణ్ కెరీర్ లో కూడా చాలా సినిమాలు సరిగా ఆడలేదు. వీటన్నింటి వల్ల హైపర్ టెన్షన్ ఆల్రెడీ ఉండడంతో.. ఆ విషాదకర నిర్ణయం తీసుకున్నాడేమో. నా ఫ్యామిలీ మెంబర్ ని కోల్పోయినంత బాధ కలిగింది అని మురళి మోహన్ అన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker