మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త, ఒక్కొక్కరికీ రూ.3 లక్షలు, ఎలా దరఖాస్తు చెయ్యాలంటే..?
కేంద్ర ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త అందించింది, వ్యాపారం చేయాలనుకునే మహిళలు యోజన యోజన కింద బ్యాంకుల నుండి రుణాలు పొందవచ్చు. అవును, ఉద్యోగిని యోజనలో, ప్రభుత్వం 30 శాతం సబ్సిడీని అందిస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా రూ.3 లక్షల రుణం పొందవచ్చు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ బ్యాంకు రుణానికి వారు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
అయితే పథకం పేరు:-ఈ పథకం పేరు ఉద్యోగిని పథకం. దీన్ని కేంద్ర ప్రభుత్వం మహిళా వ్యాపారుల కోసం తెచ్చింది. కేంద్రం లోని మహిళా అభివృద్ధి కార్పొరేషన్ ఈ పథకాన్ని అమలుచేస్తోంది. దీని ద్వారా పేద మహిళా వ్యాపారులకు కేంద్రం మనీ ఇస్తుంది. తద్వారా వారు ఆ డబ్బుతో వ్యాపారం చేస్తూ.. అభివృద్ధి సాధిస్తారని కేంద్రం కోరుకుంటోంది. ఈ డబ్బును కేంద్రం.. సిటీల్లో మహిళల కంటే.. గ్రామాల్లో మహిళలకు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అందువల్ల గ్రామాల్లో ఉండే మహిళలు ఎక్కువగా ఈ మనీ పొందగలరు.
ఈ మనీ పొందడం ద్వారా.. లబ్దిదారైన మహిళ ఆదాయం, కుటుంబ ఆదాయం పెరిగి.. దేశానికి మేలు జరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ మనీని కేంద్రం ఉచితంగా ఇవ్వదు. వడ్డీ లేని రుణంగా ఇస్తుంది. అందువల్ల ఆ డబ్బును వ్యాపారానికి వాడుకొని, తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ మహిళా రైతులు కూడా ఈ పథకం ద్వారా బ్యాంకుల్లో వడ్డీ లేని రుణం పొందవచ్చు. ఈ ఉద్యోగిని పథకాన్ని వాణిజ్య, ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలుచేస్తున్నాయి. ఉద్యోగిని పథకం ద్వారా మహిళలు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణం మాత్రమే కాదు.. ప్రత్యేక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా పొందుతారు.
ఈ పథకం కింద కేంద్రం రూ.3 లక్షల దాకా వడ్డీ లేని రుణం ఇస్తుంది. ఈ రుణం పొందేందుకు ఎలాంటి హామీ పత్రాలూ అవసరం లేదు. ఈ రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ఎలాంటి ఫీజూ తీసుకోవు. అర్హతలు:- ఈ పథకం కింద లోన్ పొందాలంటే.. కుటుంబ సంవత్సర ఆదాయం రూ.1.5 లక్షలు లేదా అంత కంటే తక్కువ ఉండాలి. భర్త లేని మహిళలు, దివ్యాంగులైన మహిళల కుటుంబ ఆదాయానికి ఎలాంటి పరిమితులూ లేవు. ఈ లోన్ ఇచ్చేటప్పుడు ఎస్సీ/ఎస్టీ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మహిళ వయస్సు 18 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. ఏదైనా వ్యాపారం చేసే మహిళలు ఈ లోన్ పొందేందుకు అర్హులు. లోన్ పొందాలనుకున్న మహిళలు, ఇదివరకు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను తగిన గడువులో చెల్లించి ఉండాలి.
రుణం పొందేందుకు కావాల్సిన పత్రాలు:-ఉద్యోగిని స్కీమ్ కింద లోన్ పొందడానికి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటో, జన్మ ధృవీకరణ పత్రం, అడ్రెస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, బీపీఎల్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ కాపీతోపాటూ బ్యాంక్ కోరే ఇతర పత్రాలు అవసరం. ఎలా దరఖాస్తు చేసుకోవాలి:- ఉద్యోగిని పథకాన్ని పొందాలనుకునే మహిళలు.. తమకు దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి.. మనీ కోరాలి. వారు కావాల్సిన పత్రాలను కోరతారు. వాటిని సమర్పించాలి. అలాగే ఓ ఫారం ఇస్తారు. దాన్ని పూర్తి చేసి ఇవ్వాలి. ఆ తర్వాత అన్నీ పరిశీలించి లోన్ ఇస్తారు. లేదంటే.. బ్యాంకుల అధికారిక వెబ్సైట్లలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఐతే.. ఆన్లైన్లో కంటే, డైరెక్టుగా వెళ్లి అడగడం ద్వారా మరింత త్వరగా పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది.