ఎరుపు రంగులో అరుదైన నాగుపాము, ఈ పాము ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి.
యానిమల్ డైవర్సిటీ వెబ్సైట్ ప్రకారం, రెడ్ స్పిటింగ్ కోబ్రా అనేది అరుదైన జాతి పాము. ఇది ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఈజిప్ట్, టాంజానియా, ఉగాండా, సూడాన్ వంటి ప్రాంతాల్లో కనిపించే ఈ పాము శాస్త్రీయ నామం నజా పల్లీడ. ఈ పాములు అత్యధిక విష పూరితమైనవిగా చెబుతున్నారు. అయితే చిన్న పాము పిల్లను చూసినా అంత దూరం ఎగిరి పడుతుంటారు.
పాము కనిపిస్తే చాలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీస్తుంటారు. అయితే 69 రకాల జాతుల్లో ఈ మధ్య కాలంలో ఓ అరుదైన జాతి పాము కొందరి కంట పడింది. ఇప్పుడు ఆ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియోలో కనిపించే ఆ పాము ఎరుపు రంగులో చిన్న పడగ విప్పి అందంగా కనిపిస్తుంది.
అయితే ఇది చూసేందుకు ముద్దుగా ఉన్నా విషపూరితమైన నాగుపామని చెబుతున్నారు నిపుణులు. ఎప్పుడు కనిపించని ఎరుపు రంగు పామును చూసిన నెటిజన్లు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఎరుపు రంగు పామును ఓ వ్యక్తి పట్టుకున్నాడు. ఆ పామును ఆ వ్యక్తి పట్టుకుని లాగగానే ఒక్కసారిగా పాము పడగ విప్పింది.
వైరల్ అవుతున్న వీడియో @snake_fraind అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయబడింది. సోషల్ మీడియా ఈ ఖాతాలో పాములకు సంబంధించి అనేక వీడియోలు పోస్ట్ చేయబడ్డాయి. ఇటీవల షేర్ చేసిన వీడియోలో ఇలాంటి ఎరుపు రంగు పాము కనిపించింది. చాలా మంది ఈ వీడియోను ఫేక్ అంటున్నారు.