ఆ హీరోయిన్ తో కిరణ్ అబ్బవరం రహస్య ఎంగెజ్మెంట్. పెళ్లెప్పుడంటే..?
2019లో ‘రాజావారు రాణిగారు’తో సినిమాల్లో తెరంగేట్రం చేశారు కిరణ్ అబ్బవరం. ఆ చిత్రంలో రహస్య గోరక్ హీరోయిన్గా నచించారు. ఈ చిత్రం మంచి హిట్ అయింది. కిరణ్‌కు తొలి చిత్రంతోనే మంచి పేరు వచ్చింది. అయితే, ఈ మూవీ సమయంలోనే కిరణ్, రహస్య గోరక్ ప్రేమలో పడ్డారు. వీరి లవ్ జర్నీ అప్పుడే మొదలైంది. అయితే ఎట్టకేలకు మరో టాలీవుడ్ నటుడు పెళ్లి పీటలు ఎక్కనున్నాడు.
గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న రూమర్స్‌కు చెక్ పెడుతూ కిరణ్ అబ్బవరం , నటి రహస్య ఘోరక్ ఓ ఇంటి వారు కాబోతున్నారు. 2019లో ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగులో నటుడిగా ఆరంగేట్రం చేసిన కిరణ్ ఇప్పుడు అదే సినిమాలో కథానాయికగా చేసిన రహస్య తో ఈ రోజు సాయంత్రం పెద్దల సమక్షంలో ఎంగెజ్మెంట్ చేసుకున్నారు.
అయితే వీరిద్దరి రిలేషన్ గురించి ఆ సినిమా విడుదలైన తర్వాత నుంచే నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇన్నాళ్లు ఇయన వాటిపై స్పందించలేదు. తాజాగా ఎంటేజ్మెంట్తో పాత వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్లైంది.
ఇక కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘దిల్ రూబా’ సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. రహస్య మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. ‘రాజావారు రాణిగారు’ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు.