పోలీయో చుక్కలు వేయించకపోతే ఏమౌతుందో తెలుసా..? వాళ్ళని చూసి కన్నీళ్లు వస్తున్నాయ్.
పోలియో చుక్కలు వేయించకుంటే పిల్లలు అనారోగ్య పాలవడమే కాకుండా అంగవైకల్యానికి గురవుతారని వైద్యులు చెబుతున్నారు. పోలియో చుక్కలు వేయడం ద్వారా పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని, పోలియో చుక్కలు వేసిన తర్వాత ఒకటి నుంచి రెండు మూడు రోజులపాటు కొద్ది మేరకు ఇబ్బంది ఉంటుందని దానికి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. ఫీవర్ లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు అధికంగా వస్తే స్థానికంగా ఉన్న వైద్యులకు సంప్రదించి.. వారి సూచనలు, సలహాలు తీసుకోవాలని కోరారు.
ఐదేళ్ల వయసు వరకు గల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు మోతాదులో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. భారతదేశం పోలియో రహిత దేశంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ మరికొన్ని దేశాల్లో పోలియో ఇప్పటికీ ఉందని వైద్య బృందాలతో పాటు గణాంకాలు చెబుతున్నాయి. మార్చి మూడవ తేదీన తమ తమ పిల్లలకు విధిగా పోలియో చుక్కలను వేయించాలని వైద్యులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
పోలియో చుక్కలు తమ తమ పిల్లలకు వేయించిన తర్వాత తల్లిదండ్రులు చిన్నారులకు ఫీవర్ వస్తే ఆందోళన పడవద్దని, పోలియో పట్ల అపోహలు కూడా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత దేశంగా భారతదేశానికి గుర్తింపు ఉందని, అక్కడక్కడ తో బారిన పడకుండా చర్యలు చేపట్టేందుకు భారత ప్రభుత్వం పోలీయోను చిన్నారులకు ప్రత్యేకంగా అందిస్తోంది. అయితే పోలియో వ్యాక్సిన్ వేస్తే పోలియో వైరస్తో పోరాడేందుకు సిద్ధంగా ఉండి పిల్లలకు పోలియో రాకుండా కాపాడుతుంది. పోలియో లక్షణాలు ఉన్న వ్యక్తులు పోలియో డ్రాప్స్ వేస్తే సాధారణంగా 1-2 వారాలలో పూర్తిగా కోలుకుంటారు.
లక్షణాలు మరింత తీవ్రంగా ఉన్న వ్యక్తులు బలహీనంగా లేదా జీవితాంతం పక్షవాతానికి గురవుతారు. కొందరు చనిపోవచ్చు కూడా. కోలుకున్న తర్వాత.. కొంతమంది వ్యక్తులు వారి ప్రారంభ అనారోగ్యం తర్వాత 30-40 సంవత్సరాల వరకు పోస్ట్పోలియో సిండ్రోమ్ ను అభివృద్ధి చేయవచ్చు. కాబట్టి అప్పుడే పుట్టిన పిల్లలు నుండి ఐదు సంవత్సరాల తప్పకుండా పోలియో టీకాలు వేసి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని డాక్టర్ విజయలక్ష్మి అంటున్నారు.