UPI Payments చేసేవారికి అద్దిరిపోయే శుభవార్త. అదేంటో తెలుసుకోకుంటే..?
యూపీఐ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపు పద్ధతుల్లో ఒకటిగా మారింది. యూపీఐ ఐడీ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌తో ఎవరికైనా చెల్లింపులు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. మొదట్లో దేశీయ అవసరాల కోసం ప్రారంభించబడిన ఈ వ్యవస్థ దేశంలో చెల్లింపుల యొక్క ప్రాధాన్యత మోడ్‌గా మారింది. అయితే అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులను ఇప్పుడు విదేశాలలో అందుబాటులో ఉన్నాయి.
విదేశాల్లోని భారతీయులకు లావాదేవీలను సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం ఫ్రాన్స్, యూఏఈతో సహా అనేక అంతర్జాతీయ దేశాల్లో యూపీఐ చెల్లింపులను అందుబాటులోకి తెచ్చింది. ఇది అంతర్జాతీయ లావాదేవీలను ప్రారంభించడానికి ప్రవాస భారతీయులకు కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పుడు యూపీఐ సేవలు మరింత సులభం కానున్నాయి. బ్యాంక్ ఖాతాతో పని లేకుండా చెల్లింపులు చేసేలా ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సౌలభ్యాన్ని మొబిక్విక్ ప్రవేశ పెట్టింది.
మీరు ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తారా? అయితే ఇప్పుడు మీ అకౌంట్ ను లింక్ చేయకుండానే చెల్లింపులు చేసేయొచ్చు. దీనికి సంబంధించిన సరికొత్త ఫీచర్ ను దేశీయ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ మొబీక్విక్ తీసుకొచ్చింది. బ్యాంక్ అకౌంట్ తో అనుసంధానం లేకుండానే పేమెంట్స్ జరిపేలా పాకెట్ యూపీఐ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాకెట్ యూపీఐ ఫీచర్ తో బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకుండానే మొబీక్విక్ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
బ్యాంక్ ఖాతాకు బదులు వాలెట్ కు నిధులు బదిలీ చేయడం ద్వారా ఆర్థిక లావాదేవీలను క్రమబద్దీకరిస్తుందని సంస్థ తెలిపింది. బ్యాంక్ ఖాతా నుంచి నిధుల బదిలీ కంటే మొబీక్విక్ వ్యాలెట్ నుంచి బదిలీయే సురక్షితమని, ఆర్థిక మోసాలకు అవకాశం ఉండదని మొబీక్విక్ వెల్లడించింది.