భర్తలు జీవితంలో ఈ విషయాలు మీ భార్యకు అస్సలు చెప్పకండి. పొరపాటున చెప్పారో..?
భర్తలు తమ బలహీనతల గురించి భార్యలకు చెప్పకూడదట. భార్యలు తరచూ వాటి గురించి ప్రస్తావిస్తే భర్తల్లో ఆత్మనూన్యతా భావం మరింత పెరుగుతుందట. అందుకే అస్సలు చెప్పకూడదట. అలాగే తనకు జరిగిన అవమానాల గురించి కూడా భర్తలు తమ భార్యలకు చెప్పకూడదట. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ఒకరి తప్పులను ఒకరు మన్నించుకుంటూ.. ఒకరిని మరొకరు గౌరవించుకుండడం వల్ల జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. అయితే కొందరు ఇలా పెళ్లి చేసుకొని అలా విడిపోతున్నారు.
చిన్న చిన్న తప్పులకే విడాకుల పేపర్లపై సైన్ చేస్తున్నారు. కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఈ మధ్య విడిపోతున్న దంపతులు మధ్య బేధాభిప్రాయాలు రావడానికి పెద్ద కారణాలేవీ లేవని అంటున్నారు. భార్యభర్తలు మధ్య ఉన్న కమ్యూనికేషన్ లోపమే ప్రధాన కారణమని చెబుతున్నారు. అయితే ప్రతీ భార్య తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో భర్త ఏం చేసినా భరిస్తుంది. కానీ తన కుటుంబ సభ్యుల గురించి చెప్పినప్పుడు మాత్రం పెద్దగా పట్టించుకోదు.
ముఖ్యంగా భర్త తన తల్లిదండ్రులను పొగుడుతూ భార్యను కించపర్చడం అస్సలు సహించదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల గురించి లేదా బంధువుల గొప్పతనాల గురించి భార్య ముందు చెప్పకూడదు. ఇలాంటి విషయాలను అవైడ్ చేయడం ఎంతో బెటర్. తప్పుచేయని వ్యక్తి అంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఒకరి తప్పును మరొకరు మన్నించుకోవడం ద్వారా జీవితం సాఫీగా సాగుతుంది. కానీ అందరికీ అలాంటి పరిస్థితి ఉండదు.
అందువల్ల పాత తప్పులకు బయటకు లాగకపోవడమే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో పెళ్లికి ముందు ఎలాంటి తప్పులు చేసినా వాటిని భార్యతో చెప్పకూడదు. అలాగే అంతకుముందు ఉన్న గర్ల్ ఫ్రెండ్ గురించి భార్య వద్ద ప్రస్తావించకూడదు. ఇలా చేయడం ఏ వివాహిత ఒప్పుకోదు. ప్రతి మొగాడనికి కొన్ని బలహీనతలు ఉంటాయి. వీటిని కొందరు వివాహితలు ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
అయితే చాలా వరకు బలహీనతల గురించి బయటపెట్టకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే కొన్ని విషయాల్లో భార్యపై కోప్పడినప్పుడు బలహీనతల ఆధారంగా హేళన చేసే అవకాశం ఉంది. దీంతో మానసికంగా కుంగిపోయి మరింత ఆందోళన చెందుతారు. దీంతో భార్యపై మరింత అసహ్యం పుట్టుకొచ్చి విడిపోయే వరకు దారి తీస్తుంది.