News

బొద్దుగా ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు నడిచే సన్నజాజి, ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

మలయాళంలోని స్టార్ హీరోలు చాలామందితో కల్యాణి నటించేసింది. తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ చేయనప్పటికీ ఓటీటీల్లో డబ్బింగ్ చిత్రాల వల్ల తెలుగు ప్రేక్షకులు ఈమెని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడంటే మంచి ఫిజిక్‌తో ఉంటూ అభిమానుల్ని అలరిస్తున్న కల్యాణి ప్రియదర్శన్. అయితే ఇప్పుడు త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.

నెట్టింట సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. పుట్టినరోజున లేదా ఏదైనా అకేషన్ ఉంటే.. చాటు వాటిని వైరల్ చేస్తుంటారు. చిన్నప్పటి ఫోటోలు పక్కనబెడితే.. పైన ఫోటోలో సర్కిల్ పెట్టిన టీనేజ్ అమ్మాయిని చూశారా..?. తను ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ఈ అమ్మాయి ఏంటి.. హీరోయిన్ ఏంటి అనుకుంటున్నారా..?. తన ట్రాన్సఫర్మేషన్ అలాంటిది.

సినిమాల్లో హీరోయిన్‌ అయ్యేందుకు విపరీతంగా కష్టపడింది. ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. గుర్తుపడితే ఓకే.. ఇంకా కనిపెట్టని వారికి మేమే ఆన్సర్ ఇవ్వబోతున్నాం. తను కళ్యాణి ప్రియదర్శిన్. అఖిల్ అక్కినేని నటించిన హలో మూవీతో ఈమె తన ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో చిత్రలహరి, రణరంగం సినిమాల్లో నటించింది.

టాలెంట్, అందం ఉన్నా కానీ.. మళ్లీ తెలుగులో కనిపించలేదు. కానీ తమిళం, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. కళ్యాణి తండ్రి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు. 90వ దశకంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేశాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker