లండన్‌లో ప్రభాస్ కొత్త ఇల్లు, నెలకు దాని అద్దె ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతమున్న పాన్ ఇండియా హీరోల్లో టాప్ అని చెప్పొచ్చు. ‘బాహుబలి’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. వరసపెట్టి మూవీస్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. రెండు నెలల ముందు ‘సలార్’తో వచ్చి హిట్ కొట్టిన ఇతడు.. మరో రెండు నెలల్లో ‘కల్కి’గా రాబోతున్నాడు. అయితే డార్లింగ్ ప్రభాస్ అద్దె ఇల్లు తీసుకున్నాడు. ఆయనకు అద్దె ఇంట్లో ఉండాల్సిన ఖర్మేమిటి? అని అనుకోకండి. ఆయన అద్దెకు ఇల్లు తీసుకున్నది ఇక్కడ కాదు,
లండన్‌లో! కొన్నాళ్ల పాటు లీజ్‌కు తీసుకున్న ఈ ఇంటి కోసం నెల నెల లక్షల రూపాయల అద్దెను ఇవ్వాల్సి ఉంటుంది. బాహుబలి సినిమాతో జగద్విఖాతిని గడించిన ప్రభాస్‌కు ఇప్పుడు బోల్డంత క్రేజ్ ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలలో ప్రభాసే టాప్! బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఆ రేంజ్ హిట్ పడకపోయినా ఇటీవల వచ్చిన సలార్ సినిమా ఆయన స్థాయిని మళ్లీ పెంచింది. మరో రెండు మాసాలలో కల్కి విడుదల కాబోతున్నది.
మే 9వ తేదీన రిలీజ్ కాబోతున్న కల్కిపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమా తర్వాత కొంత కాలం సినిమాలు లేవు. అందుకే కొత్త సినిమా సెట్‌లోకి వెళ్లే వరకు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు ప్రభాస్. ఇందులో భాగంగానే లండన్‌లో ఓ ఖరీదైన భవంతిని లీజ్‌కు తీసుకున్నాడు. దీనికి నెల అద్దె 60 లక్షల రూపాయలట! ఇంతకు ముందు కూడా ఇటలీలో కొన్నాళ్లపాటు అద్దె ఇల్లు తీసుకుని ఉన్నాడు. అప్పుడు నెలకు 40 లక్షల రూపాయల వరకు చెల్లించాడు.
అద్దెలు చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే మే 9వ తేదీన కల్కి సినిమా విడుదల కాబోతున్నది. మార్చి నెల మధ్య నుంచి ప్రమోషన్స్ మొదలు కానున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్, కమలహాసన్‌లు ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంవహిస్తున్న ఈ సినిమా కథ మహాభారత కాలంలో మొదలై 2989AD వరకు ఉంటుందట!