News

బర్త్‌డే రోజు 24 క్యారెట్ల బంగారపు కేక్‌ను కట్ చేసిన హీరోయిన్. వైరల్ వీడియో.

ఊర్వశి రౌతేలా తన ప్రత్యేక స్నేహితుడైన టాప్ సింగర్, ర్యాప్ స్టార్ యోయో హానీ సింగ్ తో కలిసి పుట్టినరోజు జరుపుకుంది. ఊర్వశి కేక్ కట్ చేసిన అనంతరం హనీసింగ్ ఆమెకి కేక్ తినిపించారు. ఊర్వశి రౌతేలా తన పుట్టినరోజును “లవ్‌డోస్ 2” మ్యూజిక్ వీడియో సెట్స్‌లో జరుపుకుంది. పుట్టినరోజు సందర్భంగా ఊర్వశి రెడ్ కలర్ డ్రెస్‌ లో అదరహో అనిపించింది. అయితే ఊర్వశి రౌతేలా మోడల్‌గా కెరియర్ మొదలుపెట్టారు.

2009 లో మిస్ టీన్ ఇండియా టైటిల్ ని గెలుచుకుని.. 2015 లోనే మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు. 2013 లో సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, పగల్‌పంటి సినిమాల్లో నటించారు. మిస్టర్ ఐరావత సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగులు వేసారు.

2022 లో ది లెజెండ్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో మెరిసిన ఊర్వశి తెలుగులో వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ, ఏజెంట్ సినిమాలో వైల్డ్ సాలా సాంగ్, బ్రోలో మైడియర్ మార్కండేయా పాటలో, స్కందలో కల్ట్ మామా పాటలతో దుమ్ము రేపారు. సెలబ్రిటీలు ఏం చేసినా వింతగానే అనిపిస్తుంది. ఫిబ్రవరి 25న ఊర్వశి రౌతేలా బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసారు. అది అలాంటి ఇలాంటి కేకు కాదు మరి.

మూడు కోట్ల విలువ చేసే 24 క్యారెట్ బంగారపు కేకుని కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో ఈ కేక్ ఇప్పుడు వరల్డ్ రికార్డ్ కూడా సెట్ చేసింది. తన స్నేహితుడు, స్టార్ పాప్ సింగర్ హనీ సింగ్ సమక్షంలో ఊర్వశి కేక్ కట్ చేసి తన స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పారు. ఊర్వశికి అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఊర్వశి రౌతేలా బంగారపు కేక్ కటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker