పెళ్లికి ముందే నచ్చినవాడితో రాత్రి గడుపుతారు, ఈ ఆచారం ఎక్కడో కాదు, మనదేశంలోనే..?
మన భారతదేశంలో పాటించే కొన్ని ఆచారాలను విదేశీయులు చూసినప్పుడు వారు కూడా అలాగే ఆశ్చర్యపోతారు. మరి విదేశీయులు అంతగా ఆశ్చర్యపడే అంత వింత ఆచారాలు మనదేశంలో ఏమున్నాయబ్బా అనుకుంటున్నారా. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లు మనం ఎక్కువగా చూస్తుంటాం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజనుల్లో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లు ఉన్నాయంటూ మీరు నమ్ముతారా.. కానీ భారతదేశంలో అలాంటి తెగ ఒకటి ఉంది, వీరిలో లివ్-ఇన్ రిలేషన్ షిప్ ఆచరణలో ఉంది. ఈ తెగలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ చాలా సాధారణంగా ఉంటుంది.
అంటే మహిళలు, తమకు ఇష్టమైన పురుషులతో కాపురం చేయవచ్చు. పిల్లల్నీ కనవచ్చు. ఈ సంబంధాల ద్వారా వారు తమకు సరైన భాగస్వాములను కనుగొంటారు. గరాసియా తెగలు రాజస్థాన్, గుజరాత్‌లోని కొండల ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ తెగకు చెందిన చాలా మంది మహిళలు పెళ్లికి ముందే తల్లులు అవుతారు. అంతేకాదు తమకు నచ్చిన పురుషులను భర్తలుగా స్వీకరిస్తారు. ఈ తెగలో పురుషులు, మహిళలు వివాహం లేకుండా కలిసి జీవిస్తారు.
అంతేకాదు మహిళలు కూడా పెళ్లికి ముందే తల్లులు అవుతారు. తమకు నచ్చిన మగ భాగస్వామిని ఎంచుకునే హక్కు స్త్రీలకు ఉంటుంది. వివాహాల కోసం ఇక్కడ రెండు రోజుల పాటు ఓ ఈవెంట్‌ను నిర్వహిస్తారు. ఈ ఈవెంట్‌లో యువతీ యువకులు గుమిగూడి, ఎవరినైనా ఇష్టపడితే, వారితో ఒంటరిగా జీవించడం, కాపురం చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు వారు వివాహం చేసుకోకుండానే ఒకరితో ఒకరు సంభోగం చేయవచ్చు.
ఆ తర్వాత ఊరికి తిరిగి రాగానే తల్లిదండ్రులు ఘనంగా పెళ్లి చేశారు. అయితే, వారు కోరుకుంటే అవివాహితులుగా ఉండవచ్చు. ఈ తెగలో ఇలాంటి లివ్-ఇన్ ఆచారం చాలా ఏళ్లుగా ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ తెగకు చెందిన నలుగురు సోదరులు వేరే చోట నివసించేందుకు వెళ్లారట. వారిలో ముగ్గురు భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారట, అయితే ఒక సోదరుడు పెళ్లి చేసుకోకుండానే ఒక అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ ప్రారంభించాడట.
ఆ ముగ్గురు సోదరులకు పిల్లలు లేరు, కాని నాల్గవ సోదరుడికి ఒక బిడ్డ ఉన్నాడు. అప్పటి నుంచి ఇక్కడ లివ్ ఇన్ ప్రాక్టీస్ మొదలైందని అంటారు. గార్సియా ఆడవారు కోరుకున్నట్లయితే మొదటి సహచరుడిని కలిగి ఉన్నప్పటికీ రెండవ సంభోగంలో రెండవ సహచరుడిని ఎన్నుకుంటారు. చాలా మంది మహిళలు పెళ్లికి ముందే తల్లులు అవుతారు.