Health

రాత్రి పూట బోర్ల పడుకొని నిద్రపోతే ఎన్ని రోగాలు నయం అవుతాయో తెలుసా..?

పొట్ట మీద పడుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వీపు, మెడలో ఒత్తిడి కలగడం వల్ల రాత్రి పూట మంచిగా నిద్ర పడుతుంది. అయితే ఇలా పడుకోవడం వల్ల నొప్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే బోర్లా పడుకున్నప్పుడు మొహం ఒక వైపుకి పెట్టి పడుకుంటాం. కొన్ని సార్లు అటు ఇటు తిప్పుతూ ఉండటం వల్ల మెడలు నొప్పులు వస్తాయి. అయితే నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే 7 నుంచి 8 గంటల వరకు నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నిద్రించేటప్పుడు వివిధ భంగిమల్లో నిద్రపోతూ ఉంటాము. కొందరు నిటారుగా, కొందరు ఎడమవైపు తిరిగి, మరికొందరు కుడివైపు తిరిగి నిద్రపోతూ ఉంటారు.. అయితే కొంతమందికి బోర్ల పడుకోవడం అలవాటు. అలా పడుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గురక పెట్టే వారు బోర్లా పడుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నిటారుగా పడుకోవడం వల్ల కొండనాలుక శ్వాస మార్గానికి అడ్డుపడి గురక ఎక్కువగా వస్తూ ఉంటుంది.

బోర్లా పడుకోవడం వల్ల కొండనాలుక శ్వాస మార్గానికి అడ్డుపడకుండా ఉంటుంది. గురక రాకుండా ఉంటుంది. దాంతో హాయిగా నిద్రపోతారు. అప్పుడే ఎన్నో రోగాలు నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. నడుం నొప్పి తగ్గాలని అనుకొనేవారు బోర్ల పడుకోవడం మంచిది. కొందరిలో తుంటి భాగంలో ఎముకలపై ఒత్తిడి ఎక్కువగా పడి సయాటికా నొప్పులు వంటివి వస్తూ ఉంటాయి.

అలాంటి వారు అలాగే మెడ నొప్పులతో బాధపడే వారు కూడా బోర్లా పడుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా కొందరిలో పక్కకు తిరిగి పడుకున్నప్పుడు చేతులపై ఒత్తిడి పడి తిమ్మిర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి.. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందని చెబుతున్నారు.. నిద్ర కూడా బాగా పడుతుంది.. ఇంకా ఎన్నో సమస్యలు నయం అవుతాయని ఆరోగ్య ప్రముఖులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker