News

సితారకు పోటీగా రంగంలోకి దిగిన అక్క, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో.

స్టార్ కిడ్స్ లో సితార ఘట్టమనేని చాలా ప్రత్యేకం. ఐదారేళ్ళ ప్రాయం నుండే ఆమె సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ప్రస్తుతం సితార వయసు 11 ఏళ్ళు. ఇంస్టాగ్రామ్ లో సితారకు మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇటీవల గుంటూరు కారం సినిమాలోని ఓ మై బేబీ, ధూమ్ మసాలా సాంగ్స్ కి సితార అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఆ వీడియోలు మిలియన్స్ కొద్ది వ్యూస్ రాబట్టాయి.

అతి చిన్న వయసులో ఓ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్ గా మారి, స్టార్ కిడ్ గా రికార్డు సొంతం చేసుకుంది. సితార ఎదుగుతున్న తీరు చూసి తండ్రికి తగ్గ తనయ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పుడు సితార కు పోటీగా మరో ఘట్టమనేని వారసురాలు తయారైంది. మహేష్ బాబు అన్న కూతురు భారతి ఘట్టమనేని సోషల్ మీడియా లేటెస్ట్ సెన్సేషన్ గా మారింది.

సూపర్ స్టార్ కృష్ణ కు ఇద్దరు కుమారులు.పెద్దబ్బాయి రమేష్ బాబు అనారోగ్యంతో మరణించారు. రమేష్ బాబుకు ఇద్దరు సంతానం. ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అమ్మాయి పేరు భారతి. తాజాగా గుంటూరు కారం చిత్రం లోని కుర్చీ మడతపెట్టి పాటకు భారతి స్టెప్స్ వేసింది. మాస్ మూమెంట్స్ డాన్స్ ఇరగదీసింది. ప్రొఫెషనల్ డాన్సర్ ని తలపించేలా హుక్ స్టెప్స్ వేసింది.

వీడియో చూసిన వారు సితారకు గట్టి పోటీ ఇస్తుంది భారతి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సితారకు నటన పట్ల ఆసక్తి ఉన్నట్లు స్పష్టం చేసింది. భవిష్యత్తులో సినీ ఎంట్రీ ఇవ్వనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియా ద్వారా సితార భారీగా సంపాదిస్తుందని టాక్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker