News

ఫ్యాట్ కరిగించేందుకు ఈ యంగ్ హీరోయిన్ ఎంతలా కష్టపడుతుందో చుడండి.

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ’ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్ కూడా జరిగింది. విశ్వక్ సేన్ సరసన నటించిన సిమ్రాన్ చౌదరి నటన పరంగా, అందం పరంగా మెప్పించింది. హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

అయితే తన మొదటి, రెండోచిత్రంతోనే ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు చేసుకుంది. ఆమె నటనతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘బొంభాట్’, ‘చెక్’, ‘పాగల్’, ‘సెహరి’ వంటి సినిమాలతో అలరించింది. తన బ్యూటీఫుల్ లుక్ తోపాటు అలాగే తన అందంతో ఆకట్టుకుంటోంది. ఆసక్తికరమైన పోస్టులతో పాటు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది.

అయితే ఈ యంగ్ హీరోయిన్ ఎప్పుడూ ఫిట్ గానే కనిపిస్తోంది. అయితే ఫిట్ నెస్ కోసం సిమ్రాన్ ఓ ప్రత్యేమైన వర్కౌట్ చేస్తోంది. ఒంటిని విల్లులా వంచుతూ ఫ్యాట్ బర్న్ చేస్తోంది. స్పైనల్ కండీషనింగ్ అంటూ ఓ వీడియోను పంచుకుంది. మెలోడీ ట్యూన్ కు తగట్టుగా పలు ఫోజులలో బాడీని మూవ్ చేస్తూ కనిపించింది. తన ఫిటెన్ మంత్రం ఇదేనని వీడియోతో చెప్పుకొచ్చింది.

తన ఇన్ స్ట్రా పేజీలో వీడియోను చూడొచ్చు. ఇలా ట్రై చేస్తే కొద్దిరోజుల్లోనే వొంట్లోని ఫ్యాట్ బర్న్ కావడంతో పాటు ఫిట్ గా కనిపిస్తారు. అలాగే ఫిజికల్ స్ట్రెంథ్ పెరుగుతుందని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker