News

చాలా కాస్ట్లీ గురు, అల్లు అర్జున్ ధరించిన ఈ స్వెట్‏షర్ట్ ధర ఎంతో తెలుసా..?

ఎక్కువగా బన్నీ స్టైల్ గురించే అందరూ చర్చించుకున్నారు. ముఖ్యంగా అతను వేసుకొచ్చిన బ్రాండెడ్ టీ షర్ట్ అండ్ షూ గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది. వాటి ధర తెలిశాక మీరు కూడా షాక్ అవ్వకుండా ఉండలేరు. అయితే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

తెలుగు ప్రేక్షకులకే కాదు పుష్ప చిత్రంతో నేషనల్‌ హీరోగా మారారు బన్నీ. పుష్పలో తనదైన మేనరిజంతో యావత్‌ దేశాన్ని తనవైపు తిప్పుకున్నారు. స్టైల్‌కు మారు పేరుగా నిలిచే బన్నీ యూత్‌కు ఆరాధ్య దైవంగా మారారు. తాజాగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పుష్ప ది రైజ్ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు.

ఈ సందర్భంగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశిష్ట ఆహ్వానితుడిగా వెళ్లారు. 74వ బెర్లిన్ చలనచిత్ర ఉత్సవానికి అంతర్జాతీయ స్థాయి దర్శకులు, ఇతర టెక్నీషియన్లు, సినీ మార్కెటింగ్ ఏజెన్సీ ప్రతినిధులు విచ్చేశారు. ఈ సందర్భంగా బెర్లిన్‌కు వెళ్తున్న సమయంలో ఎయిర్‌ పోర్ట్‌లో కెమెరా కంటికి చిక్కాడు. ఈ సందర్భంగా బన్నీ ధరించిన టీ షర్ట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

బన్నీ ధరించిన బ్లాక్‌ కలర్‌ టీ షర్ట్‌కు సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. లండన్‌కు చెందిన బార్బెర్రీ అనే కంపెనీ టీ షర్ట్‌ను ధరించాడు బన్నీ. ఈ టీ షర్ట్‌ ధర అక్షరాల రూ. 27,988 కావడం విశేషం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker