Health

రోజుకు రెండు నిమిషాలు ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే రక్తపోటు సమస్య నుంచి బయటపడతారు.

అధిక రక్తపోటును రక్తపోటు అని కూడా అంటారు. వ్యక్తి యొక్క కార్యాచరణ ఆధారంగా రోజంతా రక్తపోటు మారుతుంది. రక్తపోటు స్థాయిలు ఎక్కువగా ఉంటే, గుండె జబ్బులు, గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు ఎక్కువ ప్రమాదం ఉంది. చాలా మంది వైద్యులు 140/90 మరియు అంతకంటే ఎక్కువ రక్తపోటును ఎక్కువగా భావిస్తారు. అయితే రక్తపోటు స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, గుండె పోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆహారం, వ్యాయామాలు, జీవనశైలిపై ఇది ఆధారపడి ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే నిర్వహించిన ఓ అధ్యయనం ఓ వ్యాయామ ఫలితాలు వెల్లడించింది. రోజులో రెండు నిమిషాలు ఈ వ్యాయామం చేస్తే రక్తపోటు అదుపులో ఉంటుందని తెలిపింది. ఈ అధ్యయనం గురించి బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసన్​లో ప్రచురించింది. రక్తపోటు ఉన్నవారు ఇతర వ్యాయామాల కంటే.. ఐసోమెట్రిక్ వ్యాయామాలు చేస్తే రక్తపోటు కంట్రోల్​లో ఉంటుందని గుర్తించారు. దీనిలో ముఖ్యంగా వాల్​ సిట్ మంచి ఫలితాలు ఇచ్చిందని వారు తెలిపారు. వాల్ సిట్ అంటే ఏమి లేదండి. గోడ కుర్చీ . చిన్నప్పుడు టీచర్లు పనిష్మెంట్ ఇవ్వడం కోసం వాల్ సిట్ వేయించేవారు.

ఇప్పుడు హెల్త్​ కోసం మనం అదే చేయాలి అనమాట. ఈ ఆసనం చేయడం చాలా సులభం. కానీ అందరికీ సులభమని చెప్పలేము. కానీ.. దీనిని తక్కువ సమయం చేసినా.. ఎక్కువ ఫలితాలు పొందవచ్చట. ముఖ్యంగా రక్తపోటు ఉన్నవారు గోడ కుర్చి వేస్తే.. ఆ సమస్య త్వరగా కంట్రోల్ అవుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా కండరాలు బిగుతుగా.. బలంతో.. ఓర్పును పెంపొందించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. రన్నింగ్, సైక్లింగ్ వంటి ఇతర రకాల కార్డియోల కంటే.. రక్తపోటును తగ్గించడంలో వాల్ సిట్​ ప్రభావవంతమైన ఫలితాలు ఇచ్చింది.

సుమారు ఎనిమిది నిమిషాలు.. వారంలో మూడు సార్లు చేస్తే.. రక్తపోటులో ఆరోగ్యకరమైన తగ్గింపునకు దారి తీస్తుందని ఈ అధ్యయనం తెలిపింది.గోడకు కుర్చీ వేసినట్లు శరీరాన్ని గోడకు ఆనించి.. కుర్చీ పోజీషన్​లో కుర్చోవాలి. ఈ ఆసనంలో మీ వీపు నేరుగా గోడకు ఆనించి.. మీ మోకాళ్లు 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోండి. ఈ స్థానంలో రెండు నిమిషాలు ఉండి.. మరో రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా నాలుగు సార్లు పునరావృతం చేయాలి. పరిశోధనల ప్రకారం ఇలా చేయడం వల్ల సిస్టోలిక్ రక్తపోటు 10 mmHg, డయాస్టోలిక్ ఒత్తిడిని 5 mmHg తగ్గించిందని పరిశోధన పేర్కొంది.

అందుకే దీనిని రక్తపోటు ఉన్నవారి కోసం అత్యంత ప్రభావవంతమైన వ్యాయామంగా చెప్తున్నారు. సాధారణంగా ఐసోమెట్రిక్ వ్యాయామాలు రక్తపోటును అత్యంత సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఎందుకంటే కండరాలు సంకోచించడం.. ఆ స్థాన్ని పట్టుకోవడం వల్ల కండరానికి రక్తప్రవాహం తాత్కాలికంగా తగ్గుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని సడలించడానికి రక్తనాళాలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల రక్తపోటు సమర్థవంతంగా తగ్గుతుందని పరిశోధకులు వివరించారు. ఈ వ్యాయామం మీకు బాగా అలవాటు అయితే.. మీరు వ్యాయామ సమయాన్ని పెంచుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker