News

శని దోషం ఉన్నవారు శనివారం రోజున ఎలాంటి పనులు చెయ్యాలో తెలుసుకోండి.

శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణించబడుతుంది. దాదాపు రెండున్నరేళ్ల పాటు ఒకే రాశిలో ఉంటుంది. శని ఏ రాశిలోనైతే ఉంటుందో దాని ముందు రాశిపై ప్రభావం చూపుతుంది. దీన్నే ఏలిననాటి శని అని అంటారు. ప్రస్తుతం శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో ధనస్సు, మకరం, కుంభం రాశి వారిపై ఏలిననాటి శని ప్రభావం ఉంటుంది. ఈ మూడు రాశుల వారు తప్పకుండా శనికి సంబంధించిన నివారణలు పాటించాలి. అయితే ఆ వ్యక్తి జీవితంలో అనేక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

అదే సమయంలో శనీశ్వరుడి ఎవరిపైన అయినా దయ చూపిస్తే ఆ వ్యక్తి జీవితంలో అన్ని రకాల ఆనందాలను అనుభవిస్తాడు. ప్రతి పనిలో విజయం సాధిస్తాడని నమ్ముతారు. ఎవరి జాతకంలోనైనా శని దోషం లేదా ఏలి నాటి దశ నడుస్తుంటే.. అశుభ ఫలితాలను నివారించడానికి, శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. విశ్వాసం ప్రకారం శనివారం నాడు రావి చెట్టును పూజించడం ద్వారా శనీశ్వరుడు ప్రసన్నుడవుతాడని.. తన భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు. అందుకే ప్రతి శనివారం రావి చెట్టుకు నీటిని సమర్పించి ఆవనూనె దీపం వెలిగించి పూజించండి.

కుక్కకు సేవ చేయడం ద్వారా శనీశ్వరుడు సంతోషిస్తాడు. తన ఆశీర్వాదాన్ని అతనిపై కురిపిస్తాడు. అందుకే ప్రతి శనివారం కుక్కలకు ఆహారం ఇవ్వండి. నల్ల కుక్కకు ఆవనూనె రాసి తినడానికి ఆహారాన్ని అందించండి. శనీశ్వరుడినికి సుగంధధూపం ఎంతో ప్రీతికరం. అందుకే ప్రతి శనివారం ఇంట్లో ధూపం వేయడం వల్ల ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోయి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు. ప్రతి శనివారం సూర్యాస్తమయం తర్వాత శనీశ్వరుడు ఆలయానికి వెళ్లి ఆవనూనె దీపం వెలిగించండి.

దీపంలో కొన్ని నల్ల నువ్వులు వేయండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు అనుగ్రహాన్ని కురిపిస్తాడు. జాతకంలో శని దోషం వలన కలిగే అశుభ ఫలితాలను నివారించడానికి శనీశ్వరుడిని అనుగ్రహం పొందడానికి, హనుమంతుడిని పూజించండి. ముఖ్యంగా హనుమాన్ చాలీసా లేదా సుందరకాండను ప్రతి శనివారం పఠించండి. జాతకంలో ఏలి నాటి శని వలన కలిగే అశుభ ఫలితాలును తగ్గించాడని శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి ప్రతి శనివారం తప్పనిసరిగా శని చాలీసా పారాయణం చేయాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker