News

గుర్తుపట్టలేకుండా మరిపోయిన ఈ తెలుగు హీరోయిన్‌ ఎవరో చెప్పుకోండి చూద్దాం..?

వైష్ణవి చైతన్య..చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి బేబీ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.ఇక ఈ సినిమా తరువాత ఈమె తదుపరి సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీ అయ్యారు. అయితే వైష్ణవి చైతన్య పేరు తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ముఖ్యంగా బేబి సినిమాను చూసిన జనాలు ఈ అమ్మడి నటనకు ఫిదా అయ్యారు. హీరోయిన్‌గా మొదటి సినిమాలోనే ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ఈ సినిమా కంటే ముందే ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

తన పాటలతో పాటు, టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ హైదరాబాదీ. ఇక ఆమెకు యూత్‌లో ఉన్న క్రేజ్‌ను దర్శకుడు సాయి రాజేష్ తెలివిగా ఉపయోగించుకున్నాడు. ఇక బేబి సినిమాతో బంపర్ హిట్ కొట్టిన వైష్ణవి చైతన్యకు ఏకంగా 4 సినిమాలలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. బేబి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వైష్ణవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. అంతేకాదు ఈ భామ మరో తెలుగు హీరోయిన్ శ్రీలీలకు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. పైప్ లైన్‌లో సిద్దు జొన్నలగడ్డ మూవీతో పాటు ఆనంద్ దేవరకొండ సినిమాలున్నాయి.

వీటికితోడు కొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇక వీటికి తోడు వైష్ణవి.. ఆశీష్ రెడ్డితో కూడా ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు లవ్ మీ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా కూడా ఇటీవల షూటింగ్ పనులను ప్రారంభించుకుంది. ఇక వీటితో పాటు మరో రెండు తెలుగు సినిమాలకు వైష్ణవి చైతన్య కమిట్ అయ్యారని తెలుస్తుంది. ఆమె బేబి తర్వాత తన తదుపరి చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్‌లో చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.

అది అలా ఉంటే వైష్ణవికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైష్ణవి, సిద్దుజొన్నలగడ్డతో ఓ సినిమా చేస్తోంది. అయితే టిల్లు బాయ్‌ది బర్త్ డే కావడంతో వైష్ణవి కూడా ఈ పార్టీకి హాజరైంది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోల్లో వైష్ణవి కాస్తా సన్నగా మారీ, గుర్తుపట్టలేనంతగా మారిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker