ప్రభుత్వం బంపర్ ఆఫర్, పిల్లలను కంటే రూ.62 లక్షలు మీ సొంతం.
ఒక కంపెనీ తన ఉద్యోగుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. పిల్లలకు జన్మనిచ్చినందుకు కంపెనీ తన ఉద్యోగులకు ప్రోత్సాహకాన్ని జారీ చేసింది. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తమ ఉద్యోగులకు రూ.62.34 లక్షలు చెల్లిస్తామని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోజనం పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ ఉంటుంది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జననాల రేటు తగ్గిపోతుండటంతో ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో జనాభా క్షీణించడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పిల్లలను కనడానికి ప్రోత్సహకాలను అందజేయడానికి ముందుకొచ్చాయి. ఈ క్రమంలో తమ దేశంలో దారుణంగా పడిపోయిన జననాల రేటును పెంచడానికి దక్షిణ కొరియాకు చెందిన ఓ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ బూయోంగ్ గ్రూప్ 2021 నుంచి ఈ పథకం చేపట్టింది.
దీంతో గత మూడేళ్లలో 70 మంది పిల్లలను కన్న తమ ఉద్యోగులకు 7 బిలియన్ కొరియన్ వోన్లు (5.25 మిలియన్ డాలర్లు) అందజేసింది. ఈ ప్రోత్సాహకానికి మహిళ, పురుష ఉద్యోగులు అర్హులేనని పేర్కొంది. ‘జననాలను ప్రోత్సహించడానికి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే సంస్థగా మేము గుర్తింపు పొందుతామని నేను ఆశిస్తున్నాను’ అని బూయోంగ్ గ్రూప్ ఛైర్మన్ లీ జూంగ్ కీన్ అన్నారు.
ఒకవేళ నిర్మాణం కోసం స్థలాన్ని ప్రభుత్వం అందిస్తే ముగ్గురు పిల్లలు ఉన్న ఉద్యోగులకు 300 మిలియన్ కొరియన్ వోన్ (225,000 డాలర్లు) నగదు లేదా అద్దె గృహాలలో ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. 2022లో ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు (0.78) దక్షిణ కొరియాలో నమోదయ్యింది. సంతానోత్పత్తి రేటు ఒక మహిళ తన జీవితకాలంలో కలిగి ఉన్న పిల్లల సగటు సంఖ్యను సూచిస్తుంది. అధికారిక అంచనాల ప్రకారం.. 2025లో అక్కడ సంతానోత్పత్తి రేటు 0.65కి తగ్గుతుందని అంచనా.