స్నేహితులతో విహారయాత్రకు వెళ్లి నది ఒడ్డున శవమై తేలిన ప్రముఖ డైరెక్టర్.
తమిళ్ దర్శకుడు వెట్రి దురైసామి కారు సట్లేజ్ నదిలో పడి అదృశ్యమైన సంగతి తెలిసిందే. సుమారు 9 రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా.. తాజాగా దీనికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తప్పిపోయిన దర్శకుడు నది ఒడ్డుకు శవమై కొట్టుకు వచ్చాడు. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. అయితే ఇంద్రావతు ఒరు నాల్ సినిమా దర్శకుడు వెట్రి దురైసామి తొమ్మది రోజుల క్రితం అనగా..
ఫిబ్రవరి మొదటి వారంలో.. తన స్నేహితులు గోపీనాథ్, తంజిన్‌లతో కలిసి హిమాచల్ ప్రదేశ్ విహారయాత్రకు బయలుదేరాడు. అయితే దురదృష్టవశాత్తు.. వారు ప్రయాణిస్తున్న కారు సట్లెజ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దాని గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. అయితే ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో.. కారు నడుపుతుంది తంజిన్ అని నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటనలో గోపీనాథ్‌కు తీవ్ర గాయాలు కాగా, తంజిన్ స్పాట్లోనే మృతి చెందాడు.
అయితే వీరితో పాటు ప్రయాణిస్తున్న దర్శకుడు వెట్రి మాత్రం తప్పిపోయినట్లు తెలిసింది. దాంతో రెస్క్యూ టీమ్ అతడి ఆచూకీ కోసం గాలించసాగింది. ఇక తొమ్మిది రోజుల తర్వాత దర్శకుడు వెట్రి దురైసామి మృతదేహం సట్లెజ్ నది ఒడ్డున లభ్యమైంది. అతని మృతదేహం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్ననూర్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుర్తించారు. ఘటనా స్థలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దర్శకుడి మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
45 ఏళ్ల దర్శకుడు వెట్రి తన స్నేహితులు ఇద్దరితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గోపీనాథ్‌కు ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. ఇక వెట్రి తప్పిపోయిన సమాచారం తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు.. దర్శకుడి ఆచూకీ తెలిపిన వారికి కోటి రూపాయల రివార్డును కూడా ప్రకటించింది. సమాచారం దర్శకుడు లొకేషన్ చూసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.