News

డైరీ మిల్క్ చాక్లెట్స్ తింటున్నారా..? ఈ వీడియో చుస్తే తినాలంటే భయపడతారు.

షాపింగ్ మాల్స్ లలో కొన్ని చోట్ల నాణ్యతను పాటించట్లేదు. ఎక్స్ పైరీ అయిపోయిన వస్తువులను స్టోర్ లోనే పెట్టుకుంటున్నారు. దీంతో షాపులో వస్తువులకు పురుగులు కన్పిస్తుంటాయి. ఇప్పటికే పలుమార్లు, బిర్యానీలో జంతువులు అవశేషాలు బయటడిన ఘటనలు వార్తలలో నిలిచాయి. అయితే హైదరాబాద్ లోని ఓ సూపర్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన డెయిరీ మిల్క్ చాక్లెట్ లో బతికున్న పురుగు కనిపించింది. చిన్న పురుగు కూడా చాక్లెట్ రంగులో మారిపోయి అటూ ఇటూ కదులుతోంది.

దీనికి సంబంధించిన వీడియోను సామాజిక కార్యకర్త రాబిన్ జాచియస్ ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా షేర్ చేశారు. దానిని అమీర్ పేట మెట్రో స్టేషన్ లో రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద కొనుగోలు చేశానని చెబుతూ, దానికి సంబంధించిన బిల్ ను కూడా జత చేశారు. డెయిరీ మిల్క్ చాకట్ లో పురుగులు ఉండటం పట్ల సూపర్ మార్కెట్ యాజమాన్యాన్ని, క్యాడ్బరీ ప్రశ్నించారు. గడువు తీరిన ఈ ఉత్పత్తులకు క్వాలిటీ చెక్ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని రాబిన్ నిలదీశారు.

ఈ పోస్ట్ కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), క్యాడ్బరీ డెయిరీ మిల్క్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ను ట్యాగ్ చేస్తూ, తన కొనుగోలు బిల్లు ఫొటోను షేర్ చేశారు. అయితే దీనిపై క్యాడ్బరీ స్పందించింది. ‘‘హాయ్, మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్) అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను మెయింటెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నాం.

మీ ఫిర్యాదును పరిష్కరించేందుకు దయచేసి మీ పూర్తి పేరు, అడ్రెస్, ఫోన్ నెంబరు, కొనుగోలు వివరాలను Suggestions@mdlzindia.com ద్వారా మాకు అందించండి.’’ అని పేర్కొంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker