News

ఆ విషయంలో అమ్మ నమ్రతకు పోటీ ఇస్తున్న సితార, మహేష్ బాబు కూడా..!

తండ్రి పాటలకు డాన్స్ వేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసే సితార.. కమర్షియల్ యాడ్స్, సమాజ సేవలు చేస్తూ సూపర్ పాపులారిటీనే అందుకున్నారు. అయితే ఇప్పుడు కొందరు సైబర్ నేరగాళ్లు.. ఈ పాపులారిటీని తప్పుగా ఉపయోగించుకొని, అమాయకులను మోసం చేస్తున్నారు. అయితే సితార అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్. తనకంటూ సపరేట్ ఇమేజ్ మైంటైన్ చేస్తుంది.

ఇంస్టాగ్రామ్ లో సితారను మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. సితార తరచుగా డాన్స్ వీడియోలు, ఫోటో షూట్స్, వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. నమ్రత వయసు ఐదు పదులు దాటినా స్టిల్ యంగ్ కాలేజ్ గర్ల్ లుక్ మైంటైన్ చేస్తుంది. కఠిన వ్యాయామం చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ నమ్రత ఫిట్ అండ్ స్లిమ్ గా ఉంటున్నారు.

ఓ ప్రమోషనల్ షూట్ లో సితార, నమ్రత కలిసి పాల్గొన్నారు. పట్టుబట్టల్లో సంప్రదాయంగా కనిపించారు. అందంలో నమ్రతను మించిపోయింది సితార. అమ్మానాన్నలకు తగ్గ కూతురు అనిపిస్తుంది. సితార అప్పుడే మోడల్ గా రాణిస్తుంది. ఇటీవల సితార పీఎంజే అనే ఓ జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది.

సితార ఈ యాడ్ చేసినందుకు కోటి రూపాయల వరకు ఛార్జ్ చేసిందట. సితార పేరిట కొందరు ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన మహేష్ బాబు ఫ్యామిలీ వెంటనే చర్యలు తీసుకున్నారు. సైబర్ క్రైమ్ విభాగంలో కేసు పెట్టారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker