సితారకు సైబర్ కష్టాలు, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మహేష్ టీం.
సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ విషయాలు, రీల్స్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. అంతకు ముందు యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ స్టార్ట్ చేసి చిన్నారులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేసింది. కానీ ఇన్ స్టాలో ఇటీవల డాన్స్ వీడియోస్ ఎక్కువగా షేర్ చేస్తుంది. అయితే ఘట్టమనేని సితార.. మహేష్ బాబు కూతురిగా తనకంటూ ఓ పేరును, గుర్తింపును దక్కించుకుంటూ దూసుకెళ్తోంది.
ఇప్పటికే పలు యాడ్ ఫిల్మ్ లో నటించి.. తండ్రికి తగ్గ తనయగా పేరొందింది. సహాయంలోనూ మహేష్ ను అనుకరిస్తూ.. సంపాదించిన దాంట్లో కొంత నిర్భాగ్యులకు అందిస్తోంది. ఇక తన సోషల్ మీడియాలో మహేష్ పాటలతో పాటుగా మరికొన్ని సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ.. వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. వాటికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మనందరికి తెలిసిందే.
దీంతో మహేష్ తనకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఇదే క్రేజ్ ను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు సితార పేరుతో అభిమానులకు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ లింక్స్ పంపిస్తూ.. నగదు కాజేస్తున్నారు సైబర్ దొంగలు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మహేష్ టీమ్ స్పందించింది. వెంటనే అలర్ట్ అయిన సూపర్ స్టార్ టీమ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అంతవరకు అభిమానులు సితార పేరుతో వచ్చే ఎలాంటి లింక్స్ ను, రిక్వెస్టులకు స్పందించవద్దని మహేష్ టీమ్ కోరింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Attention! pic.twitter.com/6tX9yNQT5G
— GMB Entertainment (@GMBents) February 9, 2024