భర్త చేతిలో తన్నులు తిన్న యాంకర్ లాస్య, అసలు గొడవ ఏంటో తెలుసా..?
2020లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4లో లాస్య పార్టిసిపేట్ చేసింది. లాస్య హౌస్లో తన ఆట తీరు, మాట తీరుతో ఆకట్టుకుంది. హౌస్ మేట్స్ కి రోజూ రుచికరమైన భోజనం వండి పెట్టేది. చాలా వరకు లాస్య హౌస్లో కూల్ గా ఉండేది. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెలుచుకుంది. కూల్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరకు పూర్తిగా దూరమైన లాస్య.. తన ఫోకస్ మొత్తం సోషల్ మీడియాపైనే పెట్టింది.
యూట్యూబ్ చానెల్ ఒపెన్ చేసి.. తన కుటుంబం, పిల్లలు, భర్తతో కలిసి వీడియోలు చేస్తూ.. వాటిని పోస్ట్ చేసేది. కాగా తాజాగా లాస్య పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో ఆమె తన భర్త మంజునాథ్ చేతిలో దెబ్బలు తింటుంది. ఈ వీడియో చూసిన వారు షాక్ అవుతున్నారు. మంజునాథ్, లాస్యలది ప్రేమ వివాహం.. పైగా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.. అలాంటిది మంజునాథ్ లాస్యను కొట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.
అసలు ఏం జరిగింది అని ఆరా తీస్తున్నారు. మరి ఇంతకు ఏం జరిగింది.. మంజునాథ్ ఎందుకు లాస్య మీద చేయి చేసుకున్నాడు అంటే.. వీరిద్దరూ నిజంగా గొడవపడలేదు. ఓ ఫన్నీ రీల్ చేస్తూ.. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది లాస్య. ‘మీది మొత్తం థౌసెండ్.. రెండు లివర్లు ఎక్స్ట్రా’ అంటూ కుమారి ఆంటీ చెప్పిన డైలాగ్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో బోలేడు మీమ్స్ వచ్చాయి.
ఇక ఈ ఫన్నీ డైలాగ్‌తో లాస్య, మంజునాథ్ రీల్ చేశారు. భర్తకు చేపల కూర వడ్డించిన లాస్య.. మీది మొత్తం థౌసండ్.. ఎక్ట్రా రెండు లివర్లు అని చెప్పింది. ఆ మాటలకు మంజునాథ్.. కోపంతో లాస్య మీదకు కుర్చి ఎత్తాడు. ఈ వీడియోనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది లాస్య.