రహస్యంగా ఆ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అస్మిత సినిమాల్లోకి ప్రవేశించినా, పెద్దగా ఆఫర్లు రాలేదు. కొన్ని తెలుగు, కన్నడ, తమిళ మూవీల్లో నటించింది. కొందరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వ్యాపారవేత్త సిద్ మెహతాతో ప్రేమలో పడింది. ఏడాదిన్నరగా ఇద్దరి మధ్యా ప్రేమాయణం నడుస్తోంది. ఇటీవల ఈ జంట ప్రేగ్ వెళ్లినప్పుడు అక్కడ సిద్ మెహతా ఓ ఖరీదైన ఉంగరాన్ని బహూకరించి, తన ప్రేమను వ్యక్తం చేశాడట.
అంతే, అస్మిత కాదనకుండా ఒప్పేసుకుంది. నాలుగు రోజుల క్రితం గోవాలో సిద్-అస్మితల వివాహం జరిగింది. అయితే హీరోయిన్ అస్మితా సూద్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది. ఈ వివాహ వేడుక గోవాలో గుట్టుగా జరిగింది. కొంతకాలంగా గుజరాతీ వ్యాపారవేత్త సిద్ధ్ మెహతాతో ప్రేమాయణం సాగిస్తున్న ఈ అమ్మడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
గతేడాది సెప్టెంబర్‌లోనే నిశ్చితార్థం కాగా.. అస్మితా సూద్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గోవాలో ఫిబ్రవరి తొలి వారంలో ‘లవ్ ఆఫ్ లైఫ్’ సిద్ధ్ మెహతాను వివాహం చేసుకుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింటా చక్కెర్లు కొడుతున్నాయి. 2011లో బ్రమ్మిగాడి కథ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ లో పలు టెలివిజన్ షోలల్లో కూడా నటించి పాపులారిటీ పొందింది.