రజినీకాంత్ తండ్రిని ఎప్పుడైనా చూశారా..? అచ్చం మరో సూపర్ స్టార్ యే, వైరలవుతున్న ఫోటో.
రజినీకాంత్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించిన రజినీకాంత్ ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజమే నట. రజనీకాంత్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన..తన కెరియర్ మొదట్లో ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే ఇటీవల సెలబ్రెటీల ఫ్యామిలీ ఫోటోస్.. వారి చిన్ననాటి ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
తమ అభిమాన తారల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. తారల చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మాత్రం సూపర్ స్టార్ కు సంబంధించిన ఓ అరుదైన ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో రజినీ తన తండ్రితో కూర్చుని మాట్లాడుతున్నారు.
సాధారణంగా రజినీ తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు ఎక్కువగా జనాలకు తెలియదు. ఆయన తండ్రి పేరు రామోజీ రావు.. గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. రజినీ బెంగుళూరులో ఓ మరాఠీ కుటుంబంలో జన్మించాడు. ఆయన అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. తొమ్మిదేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు రజినీ. సినిమాల్లోకి అడుగుపెట్టకముందు రజినీ బెంగుళూరు ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లో బస్ కండక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
అయితే రజినీ తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటో ఇప్పటివరకు ఎక్కడ బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం తన తండ్రితో కలిసి కూర్చుని సూపర్ స్టార్ ముచ్చటిస్తున్న ఫోటో మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. లాల్ సలామ్ సినిమా తర్వాత రజినీ.. జ్ఞానవేల్ దర్శకత్వంలో వేడియాన్ చిత్రంలో నటించనున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు రజినీ.