News

సొట్టబుగ్గలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత అదృష్టమో తెలుసా..?

సొట్టబుగ్గలు ఉన్న వ్యక్తులు అందంగా కనిపించడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఇదే సమయంలో సొట్టబుగ్గలున్న వ్యక్తులు భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెబుతుంటారు. సొట్టబుగ్గలున్న వారిని వివాహం చేసుకుంటే అదృష్టం అని అంటుంటారు. అయితే సొట్టబుగ్గలు ఉన్న వ్యక్తులు అందంగా కనిపించడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. వారు నవ్వినప్పుడు కనిపించే సొట్ట బుగ్గలే వారి అందన్ని డబుల్ చేస్తుంటాయి. ఇదే సమయంలో సొట్టబుగ్గలున్న వ్యక్తులు భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెబుతుంటారు.

అవును… సొట్టబుగ్గలున్న వారిని వివాహం చేసుకుంటే అదృష్టం అని అంటుంటారు. వీరితో వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుందట. సొట్టబుగ్గలు ఉన్నవారు ఎప్పుడూ మంచి భార్య గా ఉండటంతో పాటు.. అత్తమామల పట్ల చాలా ప్రేమగా, శ్రద్ధగా ఉంటారట. వారు ఎల్లప్పుడూ వినయపూర్వకంగా ఉంటారట. ఇవన్నీ ఒక భర్త తన భార్యలో ఉండాలని కోరుకునే ప్రాథమిక లక్షణాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సొట్ట బుగ్గలు ఉన్నవారు అద్భుతమైన ప్రేమ జీవితాన్ని కలిగి ఉంటారట.

ఇదే సమయంలో… వారు ఎల్లప్పుడూ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని తెలుస్తోంది. భాగస్వామిని ఎలా చూసుకోవాలో, అతనిని ఎలా సంతోషపెట్టాలో సొట్టబుగ్గలున్న చిన్నారికి మరింత బాగా తెలుస్తుందట. సొట్టబుగ్గలు కలిగి ఉన్న స్త్రీలు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారట. వారు ప్రతి విషయంలోనూ చాలా ఓపెన్‌ గా ఉండటంతోపాటు.. తమ జీవితాన్ని ఏమాత్రం సంకోచించం లేకుండా.. ఇతర విషయాల గురించి చింతించకుండా జీవిస్తారట. పైగా వీరి ముఖంలో దుఖం చాలా అరుదుగా కనిపిందంట.

సొట్ట బుగ్గలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే… ముందు వారితో స్నేహం ఉండటం ముఖ్యం! నిజం చెప్పాలంటే… బుగ్గ మీద సొట్ట అన్నది చిన్న లోపం. కాకపోతే… అది అందమైన లోపం! అవును… బుగ్గమీది చర్మం ఇంకా దాని కింద నుండే కండ.. రెండూ సరి సమానంగా లేనప్పుడు ఈ సొట్ట ఏర్పడుంది. దీంతో… నవ్వినప్పుడు వీరిలో కండకన్నా ఎక్కువ ఉన్న చర్మం సొట్టలా ఏర్పడుతుంది. అంటే… ఇది ఒక అందమైన లోపం అన్నమాట. లోపమే కాదు.. అదృష్టం కూడాను!!

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker