పెళ్లి అయ్యాక కూడా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ప్రధాన కారణాలు ఇవే.
పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకునే ప్రేమ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తున్న ఈ తరం దంపతుల పోకడ పాతతరం వారికి ఆందోళనకు కారణమవుతోంది. అదేసమయంలో కొందరు మహిళలు పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కూడా పెళ్లి పెటాకులవడానికి ఓ కారణంగా ఉంది.
అయితే అక్రమ సంబంధం వల్ల కేవలం ఒక కుటుంబం మాత్రమే కాకుండా ఇరువైపులా ఉన్న కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రతిరోజు వార్తల్లో అక్రమ సంబంధాల వల్ల జరిగిన దారుణాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు చిన్న వయసులోనే వివాహం చేసేవారు. దాంతో మరొకరి పైకి మనసు మళ్లే అవకాశం ఉండేది కాదు. దాంతో అక్రమసంబంధాలు తక్కువ కనిపించేవి. ప్రస్తుత జీవితంలో తమ జీవిత భాగస్వామిని పట్టించుకోకుండా ఉండటం.
ఉద్యోగంలో ఉన్న టెన్షన్స్ వల్ల ఆఫీసు లోనే ఎక్కువ సమయం గడపడం దాంతో కుటుంబాన్ని పట్టించుకోకపోవడం. లాంటి కారణాల వల్ల కూడా ఈ సంబంధాలు పెరిగిపోతున్నాయి. జీవితంలో వస్తున్న ఆర్థిక సమస్యలు కూడా కొన్నిసార్లు అక్రమ సంబంధాలకు కారణమవుతాయి. ఉన్నదానితో సంతృప్తి పడకుండా లేనిదాని కోసం పాకులాడే క్రమంలో ఇతరులు ఆశచూపితే లొంగిపోవడం వల్ల ఇలాంటి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి లో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడటం.
లేదా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఒంటరిగా ఉండాలనే భావన భర్తలకు రావడం లాంటి వి కూడా అక్రమ సంబంధాలకు దారి తీస్తాయి. ఇష్టం లేని పెళ్లిళ్లు చేయడం కూడా అక్రమ సంబంధాలకు కారణమవుతుంది. పెళ్లికి ముందే భర్త లేదా భార్య ఎవరితోనైనా ప్రేమలో ఉండటం లేదా పెళ్లయిన తర్వాత తమ జీవిత భాగస్వామి నచ్చక మరొకరికి ఆకర్శితులు అవ్వడం కూడా అక్రమ సంబంధాలకు దారి తీస్తోంది.