అనుష్కకు ఘోర అవమానం, వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనుష్క తల్లిదండ్రులు.
అనుష్క..కోడి రామకృష్ణ దర్శకత్వంలో, మల్లెమాల నిర్మాణంలో వచ్చిన అరుంధతి సినిమా ఆమె సినీ కెరీర్ను పూర్తిగా మలుపుతిప్పింది. ఈ సినిమాతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఈ సినిమా నుంచి అనుష్కను ఎలా పడితే అలా చూపించడం మానేశారు దర్శకులు. దీంతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఈమెకు హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
ఇక బాహుబలిలో దేవసేన పాత్ర.. ఆమెకు మరో మైలురాయిగా చెప్పోచ్చు. ఆ సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా నటిగా మారింది అనుష్క. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో అనుష్క శెట్టి ఒకరు. రీసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో హిట్ అందుకుంది అనుష్క. ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్క శెట్టి తల్లి తండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అందుకు కారణం డీప్ ఫేక్ వీడియోలు.
అనుష్క ను అసభ్యంగా చూపిస్తూ ఈ వీడియోలను విడుదల చేశారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి హీరోయిన్స్ అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. రష్మిక మందన్న వీడియోలు వైరల్ అవ్వడంతో చాలా మంది దీని పై స్పందించారు.
ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేసేవారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా అనుష్క వీడియోలు , ఫోటోలు వెంటనే తొలగించాలని కోరుతూ అనుష్క పేరేంట్స్ ఫోలీసులకు ఫిర్యాదు చేశారు.. వాటిని పోస్ట్ చేసిన వారిని, వైరల్ చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.