40ఏళ్ల వయస్సులో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరోయిన్, వరుడు ఎవరో తెలుసా..?
ఎట్టకేలకు మీరా చోప్రా తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. మీరా చోప్రా ప్రస్తుతం బాలీవుడ్‌లో సఫెద్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీరా చోప్రా.. తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ నుంచి 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘బంగారం’. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మనే మీరా చోప్రా.
ఈమె ప్రియాంక చోప్రాకు కజిన్. తమిళ చిత్రాలతో మీరా చోప్రా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కోలీవుడ్ లో కొన్నేళ్లుగా వరుస చిత్రాలతో సందడి చేసింది. తెలుగులో ‘బంగారం’తో పాటు ‘వాన’, ‘మారో’, ‘గ్రీకు వీరుడు’ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. అయితే మీరా చోప్రా గురించి ఓ న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సీనియర్ నటి 40 ఏళ్ల వయస్సులో పెళ్లికి సిద్ధమైందనే వార్త బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది. త్వరలో తన మ్యారేజ్ ఉంటుందని, ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమైనట్టు చెప్పినట్టు తెలుస్తోంది. మార్చి నెలలో రాజస్థాన్ వేదికగా వివాహా వేడుక ఘనంగా జరగబోతుందని సమాచారం. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.