షోయబ్ మాలిక్ తో విడాకులు, సానియా మీర్జా కు ఎంత భరణం ఇచ్చారో తెలుసా..?
పెళ్లయిన రెండు రోజుల తరువాత ఈ జంట తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సనాతో పెళ్లి ప్రకటన తర్వాత షోయబ్ తన రెండో భార్య సానియా మీర్జాతో విడాకులు తీసుకున్నటు్ల కూడా స్పష్టమైంది. సనా జావేద్ తో పెళ్లి తరువాత షోయబ్ మాలిక్ తీవ్రస్థాయిలో ట్రోల్ కు గురయ్యాడు. అయితే సానియా మీర్జా షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె చాలా విమర్శలను ఎదుర్కొంది.
ఇద్దరూ 2010లో పెళ్లి చేసుకున్నారు. ఈ నిర్ణయంపై కొందరు సానియాను ట్రోల్ చేశారు. కానీ అవేమీ లెక్క చేయకుండా షోయబ్‌ను సానియా పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక మొదట కొన్ని సంవత్సరాలు సంతోషంగానే గడిపారు. ఆతర్వాత వీరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పెళ్లయిన 10-12 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇదిలా ఉంటే సానియా మీర్జా షోయబ్ మాలిక్ తో విడాకుల తీసుకున్న తర్వాత భరణంగా ఎంత తీసుకుంది అన్నదని పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
భార్యాభర్తలు విడాకులు తీసుకున్న తర్వాత భార్య మాజీ భర్త దగ్గర నుంచి ఎంతోకొంత భరణంగా తీసుకోవడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే సానియా షోయబ్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. షోయబ్ నుంచి ఒక్క రూపాయి కూడా తనకు అక్కర్లేదని తేల్చి చెప్పిందట సానియా. ఒక్క పైసా కూడా ఆశించకుండా విడాకుల పై సైన్ చేసిందట. ఈ వార్త పై నెటిజన్స్ సానియాను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.