టాలీవుడ్ లో విషాదం. తండ్రిని కోల్పోయిన తెలుగు హీరో.
వేణు చివరగా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కనిపించాడు. చాలా గ్యాప్ తరువాత ఆయన చేసిన చిత్రమది. అయితే ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. అతిథి అంటూ వెబ్ సిరీస్‌తో ఓటీటీలో వేణు సందడి చేశాడు.అయితే టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తొట్టెంపూడి వెంకట సుబ్బారావు (92) కన్నుమూశారు. వేణు తండ్రి ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసేవారు.
కాగా ఈయన కొద్దిరోజులుగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. మొన్నటి వరకు ఆయనకు వైద్యులు చికిత్సను అందించారు. ఈ క్రమంలోనే మరోసారి ఆయన ఆరోగ్యం క్షిణించగా ఈరోజు తెల్లవారుజాున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. సోమవారం తెల్లవారుజామున ఆయన మరణించారు అంటూ తెలిపారు. దీంతో వేణు ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.
సుబ్బారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక హీరో వేణు విషయానికి వస్తే ఒకప్పుడు స్వయంవరం.. చిరునవ్వుతో సినిమాలతో మన అందరిని ఆకట్టుకున్న హీరో తొట్టెంపూడి వేణు. శ్రీయ తో చేసిన సదా మీ సేవలో సినిమా తరువాత సినిమాల్లో హీరోగా చేయడం తగ్గిస్తూ వచ్చారు. 2013లో వచ్చిన ‘రామాచారి’ చిత్రం తర్వాత సినీ రంగానికి పూర్తిగా దూరం అయిన వేణు.. మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా దమ్ములో కీలకపాత్రలో కనిపించారు.
మరలా ఎక్కువ గ్యాప్ తీసుకుని ఈమధ్య రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే, గత ఏడాది ‘అతిథి’ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతున్నాడు అని వినికిడి.