వ్యవసాయం చేస్తోన్న స్టార్ కమెడియన్ వడివేలు కొడుకు. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు స్టార్ గా తమిళనాట ఎదిగాడు. ఆతరువాత కొన్ని కాంట్రవర్సీల వల్ల కొన్ని వివాదాలు ఏర్పడి… తమిళ సిని నిర్మాతల నుంచి భహిష్కరణకు గురయ్యారు. ఇక చాలా కాలానికి తర్వాత తిరిగి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యే మామన్నన్ లో తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే కోలీవుడ్ కు చెదిన ఫేమస్ కమెడియన్ వడివేలు దాదాపు అందరికీ సుపరిచమే. సినిమాల్లో తన హాస్యంతో నవ్వులు పుట్టిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు కమెడియన్ వడివేలు.
ఓ వివాదం కారణంగా చాలా కాలం నుంచి సినిమాలకు దూరమైన వడివేలు మళ్లీ ఈ మధ్యనే సినిమాల్లోకి తిరిగి వచ్చారు. వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఈ మధ్యే ‘మామన్నన్’ లో తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. కాగా వడివేలు కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా ఎక్కడా వెల్లడించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో లెజెండరీ కమెడియన్ వడివేలు కొడుకుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హాస్య నటుడు వడివేలుకు కూతురు, కొడుకు ఉన్నారు. కాగా కొడుకు పేరు సుబ్రమణి. స్టార్ కమెడియన్ కొడుకైన అతను పల్లెటూర్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల సుబ్రమణి ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రి వడివేలు గురించి.. తమ కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన తండ్రి పేరును ఎక్కడా ఉపయోగించుకోనని అలా చేయడం ఆయనకు ఇష్టం ఉండదని సుబ్రమణి తెలిపారు. తండ్రికి వారసత్వంగా వచ్చిన భూమిలోనే వ్యవసాయం చేసుకుంటున్నానని వడివేలు కొడుకు సుబ్రమణి వెల్లడించారు.
ఇక స్టార్ కమెడియన్ కొడుకై ఉండి ఇలా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న సుబ్రమణిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.