News

ఇండస్ట్రీలో విషాదం. క్యాన్సర్ తో ఇళయరాజా కూతురు కన్నుమూత.

గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న భవతారిణి శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచింది. 1995లో ప్రభుదేవా నటించిన రసయ్య అనే తమిళ చిత్రంలో పెప్పి మస్తానా.. మస్తానా.. అనే పాట ద్వారా తెరంగేట్రం చేసిన భవతారిణి వందలాది పాటలు పాడారు. అయితే భారతీయ దిగ్గజ సంగీత దర్శకులు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఇళయరాజా కుమార్తె భవతరణి(47) మరణించారు. గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె, చికిత్స నిమిత్తం శ్రీలంకకు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం(జనవరి 25న) తుది శ్వాస విడిచారు భవతరణి. తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడారు.

తన తండ్రి ఇళయరాజా సంగీత దర్శకత్వంతో పాటుగా తన సోదరులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో కూడా పలు పాటలు పాడారు భవతరణి. తెలుగులో గుండెల్లో గోదారి సినిమాలో ఓ సాంగ్ పాడారు. ఇక 2000 సంవత్సరంలో వచ్చిన భారతి సినిమాలో ‘మైల పోల పొన్ను ఒన్ను’ పాటకు గాను ప్లే బ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డును అందుకున్నారు.

సింగర్ గానే కాకుండా.. ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఆమె పనిచేశారు. భవతరణి పార్థీవ దేహాన్ని చెన్నైకి తీసుకొచ్చి.. అక్కడే రేపు(జనవరి 26)న అంత్యక్రియలు జరపనున్నట్లు సమాచారం. భవతరణి మరణవార్త విని చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనైంది. ఇళయరాజా కుటుంబానికి తమ ప్రగాఢసానుభూతి తెలుపుతున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker