హీరో సూర్య, జ్యోతిక విడాకులపై అసలు విషయం బయటకు వచ్చింది. అదేంటంటే..?
తమిళ స్టార్ హీరో సూర్య అతని భార్య జ్యోతికలు విడాకులు తీసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. గత కొంతకాలంగా సూర్య- జ్యోతికల మధ్య గొడవలు జరుగుతున్నాయని..వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో..జ్యోతిక ఏకంగా ముంబైకి తన మకాన్ని మార్చిందనే కథనాలు చాలానే ప్రసారం అవుతున్నాయి.
అయితే ముంబయిలో పుట్టిపెరిగిన జ్యోతిక.. సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత తమిళనాడులో సెటిలైపోయింది. తాజాగా పిల్లల్ని తీసుకుని ముంబైకి షిఫ్ట్ అయిపోవడంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. అయితే పిల్లల చదువు, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసమే జ్యోతిక.. సొంతింటికి వచ్చేసినట్లు టాక్ వినిపించింది. ఇవి కాకుండా మరో విషయం కూడా ఇప్పుడు అందరికీ తెలిసింది.
పెళ్లి తర్వాత యాక్టింగ్ పక్కనబెట్టిన జ్యోతిక… పిల్లలు కాస్త పెద్దోళ్లు అయిన తర్వాత ’36 వయదినిలే’ సినిమాతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. దాదాపు ఆరేళ్లు తమిళ చిత్రాలే చేసింది. ఈ మధ్యే మలయాళంలో ‘కాథల్’తో హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈమె మూడు హిందీ సినిమాలు చేస్తోంది. ఇప్పటివరకు సౌత్ సినిమాలు చేసిన జ్యోతిక.. బాలీవుడ్‌పై ఫోకస్ చేసేందుకే ముంబయి షిఫ్ట్ అయిందట. అంతే తప్ప విడాకులు కారణం కాదనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.