ఆఫర్లు లేక చివరకు ఈ బ్యూటీ ఎలాంటి పనులు చేస్తుందో చుడండి.
పూజా హెగ్డే ఈ లంగా ఓణీలో చాలా సింపుల్ గా, గార్జియస్ గా కనిపిస్తున్నా.. దీని ధర మాత్రం చాలా ఘాటే. ఈ లంగా ఓణీ ధర ఏకంగా రూ.1.39 లక్షలు కావడం విశేషం. రా మ్యాంగో బ్రాండ్ ఈ లంగా ఓణీ తయారు చేసింది. అయితే బ్యూటీ పూజాహెగ్డే మరోసారి తన గార్జియస్ లుక్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. అమ్మమ్మ ఊరెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడ పల్లెటూరి పిల్లలా తయారైంది. ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హాఫ్ శారీలో పూజా హెగ్డే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ భామ సినిమాల విషయానికి వస్తే.. రాధేశ్యామ్ మొదలుకొని, ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంటున్నాయి. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.. పరిస్థితేమి బాగాలేదు..దీంతో సోషల్ మీడియాలో అంద, చందాలు ఆరబోస్తోంది. ఇటీవల గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దర్శక నిర్మాతలు పూజాను తొలగించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పూజా హెగ్డే గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భామకు ఆఫర్స్ రాకపోవడానికి ఓ భారీ కారణమే ఉందని టాక్ నడుస్తోంది. అనుకున్న రెమ్యూనరేషన్ను మించి అడుగుతుందట. ఆమెతో పాటు వచ్చే స్టాఫ్ ఖర్చులు, ఈమె హోటల్ ఖర్చులు, తిండి ఖర్చులు, ఇలా అన్నీ కూడా నిర్మాతలే చూసుకోవాలని డిమాండ్ చేస్తుందట. దీంతో ఇదంతా ఎందుకు అంటూ కొత్త హీరోయిన్ శ్రీలీలను తీసుకుంటున్నారట దర్శక నిర్మాతలు.