నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఇదే అంటూ సమంత షాకింగ్ కామెంట్స్.
కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకోకుండా పూర్తిగా విశ్రాంతికి పరిమితం అయ్యారు, అలా అని ఏమీ పని చెయ్యకుండా కూడా లేకుండా, అభిమానులతో ఎప్పటికప్పుడు తన గురించిన విషయాలను పంచుకుంటూ తన సామజిక మాధ్యమంలో మాత్రం చురుకుగా వున్నారు. అయితే సినిమాలకు దూరంగా ఉన్న ప్రముఖ సినీ నటి సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన అభిమానులతో అన్ని విషయాలను పంచుకుంటోంది.
తాజాగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. తన వైవాహిక జీవితం గురించి ఆమె మాట్లాడుతూ… తన ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యానని సమంత తెలిపింది. తన జీవితంలో తాను చేసిన పెద్ద తప్పు ఇదేనని చెప్పింది. ఈ విషయాన్ని తాను చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని… ఎందుకంటే తన గత జీవిత భాగస్వామి తన ఇష్టాయిష్టాలను ప్రభావితం చేశాడని చెప్పింది.
కష్టాల్లో ఉన్నప్పుడే మనం విలువైన పాఠాలను నేర్చుకోగలమని తెలిపింది. మరోవైపు గతంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ… వరుస ఫ్లాప్ లు, ఆరోగ్య సమస్యలు, విడాకులు ఒకేసారి చుట్టుముట్టడంతో కుంగిపోయానని చెప్పింది. ఓవైపు ఆరోగ్యం దెబ్బతింటుంటే… మరోవైపు వైవాహిక బంధం ముగిసిపోయిందని తెలిపింది.
సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆమె నిర్మాతగా మారింది. ‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది.