ఆ స్టార్ సింగర్‌తో ప్రేమలో పడిన యాంకర్ శ్రీముఖి, పెళ్లి అంటే మాత్రం..!
శ్రీముఖి… తనదైన హోస్టింగ్ తో షో కు నూతన ఉత్సాహాన్ని తీసుకురావడం.. కామెడీ టైమింగ్ తో నవ్వించడం… స్పాంటేనియస్ గా పంచ్ లు వేయడం ఈ అమ్మడి స్పెషాలిటీ. ఇటీవల తన వ్యక్తిగత విషయాలతో హాట్ టాపిక్ గా మారింది ఈ అందాల యాంకర్. గతంలో తాను ప్రేమలో పడ్డానని, ఆతర్వాత బ్రేకప్ అయ్యిందని, ఆ డిప్రషన్ నుంచి బయటకు రావడానికి చాలా రకాలుగా ప్రయత్నించానని చెప్పుకొంచింది.
అయితే ఇక అది అలా ఉంటే.. శ్రీముఖి స్టార్ మాలో సూపర్ సింగర్ అనే ఓ రియాలిటీ షోను హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో స్టార్ మాలో ప్రతి శనివారం, ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం అవుతోంది. ఇక తాజా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. ఈ వారం రెట్రో నేపథ్యంలో పాటలను పాడనున్నారు సింగర్స్.
అయితే ఈ ప్రోమోలో జడ్జ్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, శ్రీముఖితో ఓ పాటకు డాన్స్ చేస్తూ.. అలా ఓ సైగా చేస్తాడు. దీంతో శ్రీముఖి రెస్పాండ్ అవుతూ.. ఈ తుంటరి అబ్బాయి ఇలా చేస్తాడని అప్పుడే అనుకున్నానని.. అయితే తాను మీతో ప్రేమలో లేనని.. రాహుల్ సిప్లీగంజ్ ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. దీనికి సంబందించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మరోవైపు శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఆమె కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందట. ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. మరో రెండు నెలల్లో శ్రీముఖి గుడ్ న్యూస్ చెప్ప నుందని తెలుస్తోంది. వచ్చే వేసవిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.