పెళ్లి సందడి హీరోయిన్ రవళి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందొ చుస్తే..?
హీరోయిన్ రవళి..తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటించింది.ఈమె తొలిసారిగా ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత రియల్ హీరో సినిమాలో నటించేగా అదే సమయంలో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.ఇక 1996లో విడుదలైన పెళ్లి సందడి సినిమాతో మాత్రం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే ముఖ్యంగా పెళ్లి సందడి సినిమా తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పోచ్చు.
ఈ సినిమా తనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చింది. పాపులారిటీని మరింత పెంచింది. పెళ్లి సందడి సినిమాలో రవళిపై చిత్రీకరించిన “మా పెరటి జాం చెట్టు” పాట బాగా ప్రసిద్ధి చెందింది. వెండితెరకు శైలజగా పరిచయమైన రవళి, ఆ తరువాత అప్సరగానూ పేరు మార్చుకుంది. ఇక పెళ్లి సందడి తర్వాత ఈమె ఒరేయ్ రిక్షా, శుభాకాంక్షలు వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఆ తర్వాత తెలుగులో ఈమెకు అవకాశాలు రాలేదు.
ఇక మిథున్ చక్రవర్తి ఈమెను మర్ద్ సినిమా ద్వారా హిందీ చిత్ర రంగానికి పరిచయం అయ్యింది. ఇక కన్నడలో శివ రాజ్‌కుమార్ సరసన గడబిడ కృష్ణలో నటించింది. తమిళంలో రవళి సత్యరాజ్, అర్జున్, విజయకాంత్‌ల సరసన నటించి మెప్పించింది. ఆ తరువాత కొన్నాళ్ళపాటు టీవీ సీరియళ్లలో నటించింది. ముఖ్యంగా జెమినీ టివీలో ప్రసారమైన నమో వేంకటేశ సీరియల్ ఆమెకు మంచి పేరును తెచ్చింది.