జబర్ధస్త్ ముక్కు అవినాష్ ఇంట్లో పెను విషాదం, బిడ్డను కోల్పొయిన అవినాష్.
జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చి.. బిగ్ బాస్ షోతో సెన్సేషన్‌గా మారి.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సెలెబ్రిటీగా మారిపోయాడు ముక్కు అవినాష్. కెరీర్ పరంగా సక్సెస్ అయిన అతడు.. కొన్నేళ్ల క్రితమే అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెతో వైవాహిక జీవితాన్ని కూడా విజయవంతంగా నడుపుకుంటున్నాడు. ఆమె కూడా సోషల్ మీడియాలో క్రేజ్ పొందింది. అయితే త్వరలోనే తల్లిదండ్రులము కాబోతున్నామంటూ తన భార్య అనూజతో కలిసి శుభవార్తను ఇన్ స్టాలో షేర్ చేసుకున్నాడు.
ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వీడియోలను, సీమంతం, ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్ అన్నింటిని అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఇప్పుడు తన జరిగిన విషాదాన్ని తెలియజేస్తూ ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు అవినాష్. తన భార్య అనూజకు అబార్షన్ అయిందని.. తమ బిడ్డను కోల్పొయినట్లు తెలిపాడు. ఈ విషయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని.. ఇక ఈ విషయం మీద ఎవరూ ఏ ప్రశ్నలు వేసి తమను బాధ పెట్టకండి అన్నాడు.
“నా లైఫ్ లో సంతోషమైన, బాధ అయినా… నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాం.
ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకీ థంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు.
మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్..” అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చాడు అవినాష్.