జ్యోతిష్యం చెప్పడానికి వేణు స్వామి ఎంత వసూలు చేస్తారో తెలుసా..?
సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించారు. డింపుల్ హాయతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దోషపరిహారం కూడా చేస్తారు. ఇప్పటికే ఈయన ఎంతో మంది స్టార్ హీరోహీరోయిన్ ల కోసం ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే.
దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈయన సెలబ్రెటీలకు మాత్రమే కాదు సాధారణ ప్రజలకు కూడా జాతకాలు చెబుతానని పలు సందర్బాల్లో వెల్లడించారు. మరి ఈయన జాతకం చెబితే ఎంత తీసుకుంటారు అనే సందేహం ఉందంటున్నారు నెటిజన్లు.
దోషాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఈయన ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది. సాధారణంగా అయితే గంటకు రూ. 5000 వేలు చెల్లించాలట. అయితే గంటకు ఐదు వేలు అంటే మామూలు విషయం కాదు. ఈ రేంజ్ లో డబ్బులు వసూలు చేస్తే సాధారణ ప్రజలు ఎలా చెల్లిస్తారు అని విమర్శిస్తున్నారు ఈయన జాతకాలను నమ్మేవారు.
కానీ సెలబ్రెటీలకు, రాజకీయ నాయకులకు ఈయన మరింత ఎక్కువ ఛార్జ్ చేస్తారని టాక్. ఇందులో నిజం ఎంత అనేది ఆయన చెబితేనే తెలుస్తోంది. అయితే వేణు స్వామి కేవలం జ్యోతిష్యం చెబుతూ మాత్రమే సంపాదించరట.. ఈయన పబ్ ను కూడా రన్ చేస్తారు. ఈ పబ్ ద్వారా ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే టాక్ ఉంది.