తన ప్రాణాలకు తగించి అమ్మాయిని కాపాడిన ‘యానిమల్’ నటుడు, వైరల్ వీడియో.
టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా టేకింగ్ స్టైల్, మ్యూజిక్, సాంగ్స్‌కు బీ టౌన్ పిచ్చెక్కిపోయింది. రణబీర్ కపూర్, బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రధారులుగా చేసిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లు కొల్లగొట్టే దిశగా పరుగులు పెడుతుంది. అయితే బిల్డింగ్ పైనుంచి దూకేందుకు ఆమె ప్రయత్నించింది.
ఈ సమయంలో అక్కడే ఉన్న మన్జోత్ పక్క గోడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దూకుతున్న యువతి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అతడికి సాయం చేసేందుకు మరికొందరు యువకులు అక్కడికి చేరుకున్నారు. వారి హెల్ప్‌తో ఆ యువతిని మన్జోత్ పైకి తీసుకొచ్చాడు. ప్రాణాలు తీసుకోవాలనుకున్న యువతిని ‘యానిమల్’ యాక్టర్ కాపాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన్జోత్ ధైర్య సాహసాలకు, హెల్ప్ చేయాలనుకునే గుణాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
ఇలాంటి వాళ్ల అవసరం సమాజానికి ఎంతో ఉందని ప్రశంసిస్తున్నారు. కాగా, మన్జోత్ అమ్మాయిని కాపాడిన వీడియో ఇప్పటిది కాదు. అది అతడి కాలేజ్ టైమ్‌లోది. గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ టైమ్‌లో అతడు కాపాడిన అమ్మాయిని తర్వాత శారదా హాస్పిటల్లో చేర్పించారు.
తల్లితో గొడవ కారణంగానే ఆమె ప్రాణాలు తీసుకోవాలని భావించింది. అయితే లాస్ట్ మూమెంట్లో మన్జోత్ వచ్చి రక్షించడంతో బతికిపోయింది. అనంతరం ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఇక, అమ్మాయిని కాపాడినందుకు గానూ అప్పటి ఢిల్లీ సిఖ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ మంజీత్ సింగ్ జీకే మన్జోత్ను మెచ్చుకున్నారు.
అంతేగాక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు అతడికి అయ్యే మొత్తం ఖర్చుల్ని భరిస్తామని హామీ ఇచ్చారు. మరి.. ‘యానిమల్’ యాక్టర్ సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.