News

అప్పట్లోనే సౌందర్య పై ప్రేమతో 200 కోట్ల ఆస్తిని రాసిచ్చిన వ్యక్తి. ఆ ఆస్తి ఏమందో తెలుసా..?

సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి చిత్రంలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది. తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మ్రోగించింది.

అయితే అందాల నటి సౌందర్య..ప్రస్తుతం ఆమె మన ముందు లేకపోయినప్పటికీ తన సినిమాల ద్వారా ఎప్పటికీ తన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది. 100 కి పైగా సినిమాల్లో నటించిన దివంగత నటి సౌందర్య ని ఆమె అభిమానులు ఇప్పటికి కూడా మర్చిపోలేరు. మర్చిపోలేనంతగా అభిమానుల గుండెల్లో మిగిలిపోయింది.అయితే అలాంటి నటి సౌందర్య మరణించక ముందు ఓ వ్యక్తి 200 కోట్లు ఆస్తిని రాసిచ్చారట.

మరి ఇంతకీ ఆయన ఎవరు..ఎందుకు సౌందర్య కి 200 కోట్ల ఆస్తిని రాసిచ్చారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో రూమర్లకు కొదువ ఉండదు.ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే కచ్చితంగా వారిపై ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది.అలాగే గతంలో నటి సౌందర్య మీద కూడా ఒక రూమర్ టాలీవుడ్ లో వైరల్ గా మారింది. అదేంటంటే సౌందర్య ఓ వ్యక్తితో ప్రైవేట్ పార్టీస్ లో ఎంజాయ్ చేస్తూ తనతో కాస్త క్లోజ్ గా ఉండేసరికి సౌందర్యకు ఆయనతో రిలేషన్ అంటగట్టారట.

అయితే ఇందులో ఎంత నిజం ఉన్నది అనేది వారికి మాత్రమే తెలుసు. ఇక ఆ వ్యక్తి సౌందర్య మీద ఉన్న ప్రేమతో ఆమెకు దాదాపు 200 కోట్ల ఆస్తి అంటే ఇప్పటి మార్కెట్ ప్రకారం సౌందర్య రాసిచ్చిన ఆస్తి విలువ 200 కోట్లకు పైగానే ఉంటుందట.ఇక అన్ని వందల కోట్లు ఆస్తిని సౌందర్య పై ఉన్న ప్రేమతోనే గిఫ్ట్ గా ఇచ్చారట. కానీ సౌందర్య మరణించాక ఆమె ఆస్తిని ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు ఫేక్ పత్రాలు సృష్టించి తన పేరు మీద రాయించుకున్నారట.

అలాగే సౌందర్య పేరు మీద ఉన్న వందల కోట్ల ఆస్తులు కూడా ఆమె మరణించాక ఆస్తులన్నింటికీ తన భర్తే అధిపతిగా మారి సౌందర్య కన వాళ్ళకి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదట. ఇలా ఒకరు సంపాదించిన ఆస్తిని మరొకరు అనుభవించడం అంటే ఇదేనేమో కాబోలు అంటూ ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker