Health

కరోనా వాక్సిన్ వేస్కున్నారా..? మీకో అద్దిరిపోయే శుభవార్త.

కరోనాతో బాధపడుతున్న వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా పరిశోధనలో తేలింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్న కార్డియాక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెడార్-ష్మిత్ సినాయ్ పరిశోధకులు గుండె జబ్బులకు మరియు కోవిడ్-19కి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి వెల్లడించారు. అయితే గతంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఎంతో మంది బలయ్యారు. కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌లో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. కరోనా సోకి చికిత్స తీసుకున్న తర్వాత ఇప్పటికి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేశాయి.

అయితే శరీరంలో ఇమ్యూనిటి లెవల్స్‌ పెరగడంతో పాటు కరోనా వైరస్‌ను తట్టుకునేలా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందు కోసం యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్‌లను తీసుకువచ్చారు. దీంతో ప్రతి ఒక్కరు ఫస్ట్‌, సెకండ్‌, బూస్టర్‌డోన్‌లు వేసుకునే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున చర్యలు చేపట్టాయి. ఉచితంగా వ్యాక్సిన్‌లను ఇచ్చారు. అయితే మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో విపరీతమైన జ్వరం, బాడీ పెయిన్స్‌, తలనొప్పి ఇలా రకరకాల లక్షణాలు వచ్చా.యి. తర్వాత డోస్ నుంచి ఎలాంటి సమస్యలు రాలేదు. ఇక వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత చాలా మందిలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పిలు ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో వ్యాక్సిన్‌లపై వివిధ రకాల రూమర్లు వైరల్‌ అయ్యాయి.

ఇప్పుడు తాజాగా కోవిడ్‌ 19పై భారత వైద్య పరిశోధన మండలి (ICMR) సంచలన ప్రకటన చేసింది. యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచదని ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ICMR అధ్యయానికి సంబంధించిన నివేదిక ఇండియన్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నా.. ఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని ఐసీఎంఆర్ అధ్యయనం తేల్చింది. కరోనా కారణంగా ఎంతో మంది మృత్యువాత పడగా.. యువతలో ఆకస్మిక మరణాలకు సంబంధించి కారణాలను ఐసీఎంఐఆర్‌ లోతుగా విశ్లేసించింది. 2021 అక్టోబర్‌ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య కాలంలో ఒక అధ్యయనాన్ని చేపట్టింది. దీని కోసం ఆకస్మికంగా మరణించిన 18-45 ఏళ్ల వయసు గలవారిపై ఐసీఎంఆర్‌ ఈ అధ్యయనం కొనసాగింది.

ఇందులో భాగంగా 729 కేసులు, 2916 కంట్రోల్‌ కేసులకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించింది. ఇందులో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆకస్మిక మరణాల ముప్పు తక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నా.. ఈ ముప్పు తగ్గుతుందని నివేదికలో వెల్లడించింది. ఈ ఆకస్మిక మరణాలకు ధూమపానం, అధికంగా శ్రమించడం, మరణించడానికి 48 గంటల ముందు మద్యం సేవించడం, మత్తు పదార్థాల వినియోగం వంటి వాటితోపాటు కొవిడ్‌ చికిత్స తర్వాత జీవన విధానంలో మార్పులు, ఆహారపు అలవాట్లు వంటివి కూడా కారణాలు ఉండవచ్చని ఐసీఎంఆర్‌ పేర్కొంది.

ఇటీవల గుజరాత్‌లో జరిగిన ప్రపంచ సంప్రదాయ ఔషధ సదస్సులో ఆకస్మిక మరణాలపై ఐసీఎంఆర్ రెండు అధ్యయనాలను నిర్వహిస్తోంది ఆ సంస్థ డైరెక్టర్‌ రాజీవ్‌ బహల్ పేర్కొన్నారు. అలాగే ICMR సు మారు 50 పోస్టుమార్టం నివేదికలపై అధ్యయనం నిర్వహించిందని, మరో 100 నివేదికలను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఇది కరోనా వ్యాప్తిపై పలు విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇతర మరణాలను నిరోధించే అవకాశం ఉంటుందని అన్నారు. అంతేకాకుండా ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడం, ఊపిరి తిత్తుల వైఫల్యాల కారణంగా మరణాలు సంభవించడంతో వాటిపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker