ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఆలస్యంగా తినేవారికి పక్షవాతం, గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఒక వాహనానికి ఇంధనం ఎలాగో మనిషికి బ్రేక్ ఫాస్ట్ అలా అన్నమాట. ఇంధనం లేకపోతే వాహనం కదలలేనట్టే ఉదయం లేచిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మనిషి సరిగ్గా పనిచేయలేడు. అయితే ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్, రాత్రి భోజనం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. బ్రేక్ ఫాస్ట్ ఒక వ్యక్తికి రోజంతా కావల్సిన శక్తిని అందిస్తుంది. రాత్రి తీసుకునే భోజనం శరీరానికి కావల్సిన పోషకాలను అందిస్తుంది. అల్పాహారం, రాత్రి భోజనానికి నిర్ణీత సమయం ఉంటుంది. సమయానికి తీసుకోకపోతే పక్షవాతం ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
100,000 పైగా వ్యక్తులపై ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్రేక్ ఫాస్ట్, రాత్రి భోజనం ముందుగా తినడం వల్ల గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో 1 లక్ష మందికి పైగా వ్యక్తుల డేటాను 7 సంవత్సరాలుగా సమీక్షించారు. ఈ అధ్యయనంలో గుండెపోటు, స్ట్రోక్‌లతో సహా దాదాపు 2,000 హృదయ సంబంధ వ్యాధులను కనుగొన్నారు. ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది.
అల్పాహారం ఆలస్యం అయిన ప్రతి గంట సెరెబ్రోవాస్కులర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. రాత్రి వేళ భోజనం.. రాత్రి 9 గంటల తర్వాత రాత్రి భోజనం చేయడం వల్ల స్ట్రోక్ లేదా ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్ (TIA) ముప్పు 28 శాతం వరకు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే రాత్రిపూట భోజనం చేయడం వల్ల జీర్ణక్రియలో బ్లడ్ షుగర్, రక్తపోటు పెరుగుతుంది.
అధిక రక్తపోటు సాధారణంగా సాయంత్రం పడిపోతుంది. ఇది రక్త నాళాలకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడం, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఈ విషయంలో మరింత పరిశోధన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం జనాభాలో 80 శాతం మంది మహిళల్లో ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వీరి అధ్యయనాల్లో బయటపడింది.
ఇది పురుషులను అంతగా ప్రభావితం చేయదు. అల్పాహారం ఆలస్యంగా తినే పురుషులకు కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 11 శాతం ఎక్కువగా ఉందని నివేదించింది. అయితే రాత్రిపూట ఉపవాసాల వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా పరిశోధనలు వెల్లడించాయి. రాత్రిపూట ఉపవాసం ఉంటే ప్రతి గంటకు, స్ట్రోక్ ప్రమాదం 7 శాతం తగ్గుతుందని వీరి అధ్యయనంలో కనుగొన్నారు.