గుండె నొప్పి & ఛాతీ నొప్పి ఈ రెండిటిలో ఏది ప్రాణాంతకమో తెలుసా..?
చూడడానికి చిన్నదే కానీ ఎంతటి మనషినైనా నిలబెడుతుంది. గుండె బలం అలాంటిది. లబ్‌డబ్ అని కొట్టుకుంటూ.. అన్ని అవయవాలకు రక్తాన్ని పంపుతుంది. అయితే ఛాతీ నొప్పి అనేది చాలా మందిని ఆందోళనకు గురిచేస్తుంది. ఛాతీలో కలిగే ప్రతినొప్పి గుండె సమస్యకు సంకేతం కాకపోయినప్పటికీ , అజీర్ణం, కండరాలు లాగడం వంటి వాటి వల్ల కూడా ఈ తరహా నొప్పి వస్తుందన్న విషయం తెలుసుకోవాలి. ఛాతీ నొప్పి సంకేతాలు :- ఛాతి నొప్పి తీవ్రమైనదిగా ఎప్పుడు భావించాలంటే ఛాతిలో నొప్పి తరుచుగా వస్తున్నా గుండె సమస్యలతో ముడిపడి ఉండే అవకాశాలు ఉంటాయి.
అంతేకాకుండా ఛాతి భాగంలో బరువుగా అనిపించినా గుండెకు సంబంధించిన సమస్యగా భావించాలి. చేతులు, మెడ, దవడ, వీపుపై భాగానికి జాలుగా నొప్పి వస్తుండటం, అసౌకర్యంగా అనిపించటం వంటి సంకేతాలు ఉంటే గుండె నొప్పికి దారితీసే ప్రమాదం ఉంటుందని గమనించాలి. ఛాతీ నొప్పితో పాటు, శ్వాస ఆడకపోవటం అనిపిస్తే అది గుండెకు సంబంధించిన సమస్యగా గుర్తించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంటే తక్షణం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది.
హార్ట్ ఎటాక్ లక్షణాలను ఎలా గుర్తించాలి:- గుండెపోటు లక్షణాలకు సంబంధించి ఛాతీ నొప్పి, శ్వాసఆడకపోవటం, చెమట పట్టటం వంటివి ఏకకాలంలో జరిగితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో వికారం , మైకము అనిపించడం, ముఖ్యంగా ఛాతీలో అసౌకర్యం కలగి ఉండటం కూడా గుండె సమస్యను సూచిస్తుంది. ఈ సంకేతాలపై శ్రద్ధ వహించటం మంచిది. అకస్మాత్తుగా అలసిపోవటం వంటివాటి వల్ల ఆప్రభావం గుండె పై పడే ప్రమాదం ఉంటుంది.
చెప్పలేని అలసట, ముఖ్యంగా మహిళల్లో ఈ తరహా సంకేతాలు కనిపిస్తాయి. తక్షణ సహాయం ఎప్పుడు తీసుకోవాలి :- గుండెపోటు సమయంలో, ప్రతి సెకను చాలా కీలకమైనది. ఎంత త్వరగా వైద్య సహాయం తీసుకుంటే అంతత్వరగా ప్రాణాపాయం నుండి బయటపడేందుకు, త్వరగా కోలుకునేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇతర రకాల నొప్పుల్లా కాకుండా గుండె నొప్పి సాధారణంగా తగ్గేది కాదు. కాబట్టి వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ తగిన చికిత్స పొందటం మంచిది.
గుండె నొప్పి, ఛాతీ నొప్పికి ఇతర కారణాలు :- యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం గుండె నొప్పి తరహాలో నొప్పిని కలిగిస్తాయి. శరీరంలో అసౌకర్యం కలుగుతుంది. యాసిడ్ రుచితోపాటు, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతిభాగంలో కండరాలు లాగటం, పక్కటెముకల వాపు, ఛాతినొప్పి కారణం అవుతాయి. ఛాతీపై ఒత్తిడితో నొప్పి వస్తే అది గుండెకు సంబంధించినది కాదని గ్రహించాలి. ఛాతీలో ఎలాంటి నొప్పి ఉన్నా వెంటనే వైద్య సహాయం తీసుకోవటం వల్ల పొంచిఉన్న ముప్పు నుండి బయటపడవచ్చు. అన్ని రకాల ఛాతీ నొప్పులు అత్యవసరం.